ఇటీవలికాలంలో ఆన్‌లైన్ లో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా మోసాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా OLX, Quickerలను వేదికగా చేసుకుంటున్నారు. ప్రముఖ మీడియా కథనం ప్రకారం గత నాలుగు నెలల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో 150 కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో మోసాలపై పోలీసులు ఆరా తీయడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్, పంజాబ్, హర్యాన కేంద్రాలుగా ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తేల్చారు. గత ఏడాది ఒక్క హర్యానలోనే 3 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన నేరగాళ్లు..ఆన్ లైన్ మోసాలు చేసి లక్షలు దండుకుంటున్నారు.
మోసాల తీరు తెలిస్తే షాన్ తినాల్సిందే..
OLX, Quicker, ఇతర సోషల్ మీడియా వేదికగా నకిలీ వాణిజ్య ప్రకలను ఇస్తున్నారు. మొబైల్ ఫోన్, కార్లు, బైకులు, ఇతర ఎలాక్ట్రానిక్ వస్తువులు తక్కువ ధరకే అంటూ జనాలను ఊరిస్తున్నారు. ఈ క్రమంలో తమ నకిలీ ఐడీ కార్డులను చూపిస్తూ సగం పేమెంట్ చేస్తేనే వస్తువు దక్కుతుందని చెప్పడంతో జనాలు మోసపోయి నగదును వారి అకౌంట్ లో వేస్తున్నారు. ప్రధానంగా ఆర్మీ అధికారులమంటూ నకిలీ ఐడీ కార్డులు సృష్టించిన డబ్బులు దండుకున్న కేసులు హైదరాబాద్ లో ఎక్కువగా నమోదు అయ్యారు. సైబర్ మోసాల బారిన పడిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది
మోసపోకుండా ఈ జాగ్త్రత్తలు తీసుకోండి...
ఆన్ లైన్ మోసాలు పెరిగి పోతున్న నేపథ్యంలో జాగ్త్రత్తగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా OLX, Quicker వస్తువులు కొనే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు. కార్లు,బైకులు కొనే సమయంలో లోకల్ రిజిస్ట్రేషన్ అయి ఉంటే మంచిదని లేదంటే . రిక్స్ ఎదుర్కొవస్తోందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రకటన ఇచ్చిన వారి కాంటాక్ట్ నెంబర్ True caller ద్వారా ఆ నెంబర్ ఎక్కడిదో తెలుసుకొని..ప్రకటన దారుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో బేరీజు వేసుకొని డీల్ చేసుకుంటే మంచిదని చూచిస్తున్నారు. బంపర్ ఆఫర్ ఇచ్చే వాణిజ్య ప్రకటనలను నమ్మవద్దని..దీని విషయంలో ఏమైన అనుమానాలు ఉంటే సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని హైదరాబాద్ సైబర్ క్రైం డీసీపీ రఘువీర్ పేర్కొన్నారు