Attached Bathroom: మీ ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉందా? ఈ తప్పులు చేయకండి ఇబ్బందుల్లో పడతారు!

 Attached Bathroom Precautions: ఒకప్పుడు ఇళ్లు నిర్మించినప్పుడు బాత్రూం పేరట్లో ఇంటికి కాస్త దూరంలో ఏర్పాటు చేసుకునేవారు. అయితే, ప్రస్తుతం ఈ వైఖరి మారింది. అన్ని ఇంట్లోనే నిర్మించుకుంటున్నారు.

Written by - Renuka Godugu | Last Updated : May 17, 2024, 02:57 PM IST
Attached Bathroom: మీ ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉందా? ఈ తప్పులు చేయకండి ఇబ్బందుల్లో పడతారు!

 Attached Bathroom Precautions: ఒకప్పుడు ఇళ్లు నిర్మించినప్పుడు బాత్రూం పేరట్లో ఇంటికి కాస్త దూరంలో ఏర్పాటు చేసుకునేవారు. అయితే, ప్రస్తుతం ఈ వైఖరి మారింది. అన్ని ఇంట్లోనే నిర్మించుకుంటున్నారు. బాత్రూంలు ప్రత్యేకంగా నిర్మిస్తారు. ఆరుబయట కాకుండా ఇప్పుడు పడకగదిలోనే నిర్మాణాలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఇలా చేయడం వల్ల కొన్ని సమస్యలు ప్రారంభమవుతాయి.  

సాధారణంగా ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటారు. కిచెన్ ఒకవైపు మాస్టర్‌ బెడ్‌రూం, బాత్రూం కూడా వాస్తు ప్రకారమే అన్ని నిర్మాణాలు చేపడతారు. ఎందుకంటే తప్పుడు దిశలో నిర్మించడం వల్ల ఇంటివి వాస్తు దోషం చుట్టుకుంటుంది. ఆ ఇంట్లో ఉన్నవారికి ఎదుగుదల ఉండదు ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. వాస్తు ప్రకారం బాత్రూం నిర్మించుకోవడంలో గతంలో కంటే ఇప్పుడు మరింత మార్పులు చోటుచేసుకున్నాయి. అంతేకాదు ఈ కాలంలో అటాచ్డ్‌ బాత్రూం నిర్మించుకుంటున్నారు. అయితే, ఆరోగ్యపరంగా కూడా దీనిపై కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

బాత్రూం నిర్మించుకునేటప్పుడు బెడ్‌రూంలోనే ఎక్కువగా ఇప్పుడు నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలా చేయడం విపరీతంగా పెరిగిపోయింది. కొంతమంది ప్రతి బెడ్‌రూంలో ఒక ప్రత్యేక బాత్రూం కట్టుకుంటున్నారు. ఈ విధంగా నిర్మాణం చేపడితే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యగా బాత్రూం ఎప్పుడూ క్లీన్‌గా ఉండేలా చూసుకోవాలి. బెడ్‌రూంలోనే నిర్మాణాలు చేపడుతున్నారు కాబట్టి బ్యాక్టిరియా త్వరగా వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఈ కాలంలో స్నానం చేయడం కూడా అందులోనే చేస్తున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు బాత్రూం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

ఇదీ చదవండి: నల్లమిరియాలు హెయిర్‌కు ఇలా అప్లైచేస్తే నమ్మలేని పెరుగుదలను చూస్తారు..

అంతేకాదు కొంతమంది బాత్రూంలో పళ్లు తోముకునే బ్రష్‌లు కూడా పెట్టుకుంటారు. బాత్‌రూంలోనే స్టాండ్‌ ఏర్పాడు చేసుకుని అక్కడే పెట్టేస్తారు. కానీ, బాత్రూం తడిగా ఉన్నప్పుడు బ్యాక్టిరియా త్వరగా వ్యాపిస్తుంది. దీంతోనే పళ్లు తోముకున్నప్పుడు త్వరగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇదిలా ఉంటే మరికొంత మంది తడి టవల్‌ను కూడా బాత్రూంలో వదిలేస్తారు. అక్కడే ఆరబెట్టడం కూడా చేయకూడదు. దీనివల్ల కూడా బ్యాక్టిరియా త్వరగా వ్యాపిస్తుంది. టవల్‌ కూడా ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి కచ్చితంగా శుభ్రం చేయాలని కొన్ని అధ్యయనాలు తెలిపాయి.

ఇదీ చదవండి: బాస్కెట్‌ బాల్‌ ఆడితే మన శరీరానికి 7 అద్భుతమైన ప్రయోజనాలు తెలుసా?

ఈ అటాచ్డ్‌ బాత్రూంలోనే ముఖం కడుక్కోవడానికి వాష్ బేసిన్ కూడా ఏర్పాటు చేసుకుంటారు. అక్కడే పళ్లు శుభ్రం చేసుకుంటారు. దీన్ని కూడా ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి. లేకపోతే బ్యాక్టిరియా త్వరగా పేరుకుంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కువగా తిరిగే ఈ ప్రాంతాన్ని మరింత సురక్షితంగా ఉంచుకోవాలి. లేకపోతే త్వరగా వైరస్‌ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News