Gut Healthy Fruits: మన శరీరానికి మంచి ఆహారాలు తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యం బాగుంటుంది. మంచి జీర్ణక్రియకి తోడ్పడుతుంది. బెర్రీలు, అరటి పళ్ళు, యాపిల్స్ వంటి ఆహారాలు మన డైట్ లో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు సహకరిస్తుంది. పేగు కదలికలు కూడా తోడ్పడుతుంది. ఇలాంటి రకాల పనులలో యాంటీ ఆక్సిడెంట్స్, ఎంజైమ్స్, పుష్కలంగా ఉంటాయి. ఇది మంచి డైజేషన్ కి ప్రేరేపించి జీర్ణక్రియకు సహాయపడతాయి.
ఇలాంటి ఆహారాలు మన సమతుల ఆహారానికి ప్రేరేపిస్తాయి. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గించేస్తాయి. కడుపులో మంచి బ్యాక్టిరియా పెంచడానికి సహకరిస్తాయి. మీకు ఎప్పుడు ఆకలిగా ఉన్నా కేవలం ఏదో ఒక రకమైన ఫ్రూట్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ ఇతర అనారోగ్య పదార్థాల జోలికి వెళ్లకూడదు. మన పేగు ఆరోగ్యానికి తోడ్పడి మంచి జీర్ణక్రియకు సహకరించే ఐదు రకాల పండ్లను మన డైట్ లో చేర్చుకోవాలి అవి ఏంటో తెలుసుకుందాం.
బొప్పాయి..
బొప్పాయిలో ఫ్రూట్ ప్రోటియోలెక్టిక్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటాయి. ఇది మంచి జీర్ణ క్రియ కు సహకరిస్తాయి. అంతేకాదు బొప్పాయిలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో నుంచి విష పదార్థాలను బయటికి పంపిస్తాయి. బొప్పాయి కడుపులో అజీర్తి, గ్యాస్, మలబద్ధకం, గుండె మంట సమస్యలకు కూడా మంచి రెమెడీ అని ఎన్ఐహెచ్ తెలిపింది.
అరటి పండ్లు..
అరటి పండ్లను కూడా మంచి జీర్ణక్రియకు తోడ్పడతాయి. ఇందులో కార్బోహైడ్రేట్స్, పేగు ఆరోగ్యానికి సహకరిస్తాయి ముఖ్యంగా అరటి పండ్ల లో ఎక్కువ శాతం ఫైబర్ పెక్టిన్ ఉంటుంది. అరటిపండ్లు రుచిగా, తీయగా ఉంటాయి. వీటిని డైట్ లో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో గ్లైసోమిక్ సూచి కూడా తక్కువ మోతాదులో ఉంటుంది.
ఇదీ చదవండి: ఈ ఒక్క టీ తాగితే.. రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పటికీ పెరగవు..
యాపిల్స్..
యాపిల్స్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతే కాదు ఇందులో విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు వాపు, సమస్యను తగ్గించి మంచి జీర్ణక్రియకు సహకరిస్తాయి. యాపిల్స్ లో పెక్టిన్ పేగు కదలికలకు తోడ్పడి మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహకరిస్తుందని ఎన్ఐహెచ్ తెలిపింది
అవకాడో..
అవకాడో కూడా కడుపులో ఇన్ల్ఫమేషన్ సమస్యను తగ్గిస్తుంది. అవకాడో కూడా జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా అన్ని విధాలుగా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలిపారు.
ఇదీ చదవండి: మీకు కిడ్నీలను క్లీన్ చేసే 8 ఆహారాలు.. పాడవ్వకుండా నిత్యం కాపాడతాయి..
ప్రూన్స్..
ఈ ప్రూన్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. సహజసిద్ధమైన ఈ పండ్లు పేగు ఆరోగ్యానికి మంచివి ఇన్ల్ఫమేషన్ సమస్యను తగ్గించి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయని ఎన్‌ఐహెచ్ తెలిపింది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి