Hotel Style Veg Biryani Recipe In Telugu: వెజ్ బిర్యానీ అనేది భారతీయ ఒక ప్రసిద్ధ వంటకం. దీనిని శాకాహారులకు అంకితం చేశారు. ఈ బిర్యానీని కూరగాయలు, బియ్యం, మసాలాలతో తయారు చేస్తారు. వెజ్ బిర్యానీ ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క విధంగా తయారు చేసుకుంటూ ఉంటారు. అందరూ ఈ బిర్యానీలో బంగాళాదుంపలు, క్యారెట్లు, బీన్స్ ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. మరికొంతమందైతే మొలకలు, పన్నీర్‌ను కూడా వినియోగిస్తూ ఉంటారు. దీనిని రెండు రకాలుగా తయారు చేసుకుంటూ ఉంటారు. కొందరు నార్మల్‌గా తయారు చేసుకుంటే, మరికొంతమంది మాత్రం దమ్ పెట్టి తయారు చేస్తారు. ప్రస్తుతం చాలా మందికి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో తెలియక, హోటల్స్ నుంచి ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇక నుంచి ఇలా చేయ్యనక్కర్లేదు. సులభంగా ఇంట్లోనే ఈ పద్ధతితో తయారు చేసుకుంటే హోటల్ స్టైల్ పొందడం ఖాయం..
వెజ్ బిర్యానీకి కావాల్సిన పధార్థాలు:
బియ్యం: 2 కప్పులు (బాస్మతి బియ్యం మంచిది)
కూరగాయలు:
బంగాళాదుంపలు - 2 (బాగా ఉడికించి, చిన్న ముక్కలుగా కోసుకోవాలి)
క్యారెట్ - 1 (చిన్న ముక్కలుగా కోసుకోవాలి)
ఆకుకూరలు - 1 కట్ట (కొత్తిమీర, పుదీనా)
ఉల్లిపాయలు - 2 (బాగా తరిగినవి)
టమాటాలు - 2 (బాగా తరిగినవి)
మసాలాలు:
ఇంగువ - 1/2 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
సోంపు - 1 టీస్పూన్
పసుపు - 1/2 టీస్పూన్
మిరపకాయలు - 4-5
గరం మసాలా - 1/2 టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిరపకాయలు - 2 (తరిగినవి)
నూనె: 3 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం: 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర: అలంకరణకు
ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం:
ఈ బిర్యానీని తయారు చేసుకోవడానికి ముందుగా ఓ బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది.
అందులో బియ్యాన్ని వేసి 30 నిమిషాలు నానబెట్టుకోండి.
ఒక కుక్కర్‌లో నూనె వేడి చేసి, ఇంగువ వేసి వేయించాలి.
ఆ తర్వాత ఇందులోనే జీలకర్ర, సోంపు వేసి వేయించాలి.
ఇలా వేయించిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
ఆ తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించాల్సి ఉంటుంది.
తరిగిన టమాటాలు, పసుపు, మిరపకాయలు వేసి కూడా బాగా ఉడికించాలి.
అందులోనే ఉడికించిన బంగాళాదుంపలు, క్యారెట్ వేసి కలపాలి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఇలా అన్ని వేసిన తర్వాత కొలతల ప్రకారం నానబెట్టిన బియ్యం, నీరు, ఉప్పు వేసి బాగా కలపాలి.
కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, 10 నిమిషాలు ఆవిరి పోనివ్వండి.
కుక్కర్ మూత తీసి, కొత్తిమీరతో అలంకరించి వేడిగా వడ్డించండి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి