Low glycemic fruits: గ్లైసెమిక్ సూచి తక్కువగా ఉండే ఈ 10 పండ్లు.. డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు..

Low glycemic fruits for diabetic patients: సాధారణంగా డయాబెటిస్‌తో బాధపడేవారు గ్లైసెమిక్ సూచి తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెరల స్థాయిలను హఠాత్తుగా పెంచవు.

Written by - Renuka Godugu | Last Updated : Jun 2, 2024, 08:25 AM IST
Low glycemic fruits: గ్లైసెమిక్ సూచి తక్కువగా ఉండే ఈ 10 పండ్లు.. డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు..

Low glycemic fruits for diabetic patients: సాధారణంగా డయాబెటిస్‌తో బాధపడేవారు గ్లైసెమిక్ సూచి తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెరల స్థాయిలను హఠాత్తుగా పెంచవు. డయాబెటిస్ రోగులకు ఎంతో మంచివి. ఈరోజు పది గ్లైసోమిక్ సూచి తక్కువగా ఉండే ఆహారాలను తెలుసుకుందాం ఇవి రక్తంలో చక్కెరను పెరగకుండా నివారిస్తాయి.

బెర్రీ పండ్లు..
డయాబెటిస్‌తో బాధపడేవారు గ్లైసమిక్ సూచి తక్కువగా ఉండే స్ట్రాబెరీ, బ్లూబెర్రీ, రాస్బెర్రీలను డైట్ లో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెరగనివ్వవు. అంతే కాదు ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

చెర్రీ పండ్లు..
చెర్రీ పండ్లలో కూడా గ్లైసమిక్ సూచి తక్కువగా ఉంటుంది. చెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్ రోగులు ఈ పండ్లను డైట్ లో చేర్చుకుంటే ఆరోగ్యకరం.

యాపిల్స్..
యాపిల్స్ లో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో గ్లైసమిక్ సూచి కూడా తక్కువగా ఉంటుంది. యాపిల్ తొక్కతో పాటు తీసుకుంటే అదనంగా ఫైబర్, ఖనిజాలు మీ శరీరానికి అందుతాయి.

పియర్ పండు..
డయాబెటిస్ రోగులకు ఆరోగ్యకరమైన మరో పండు పియర్ ఫ్రూట్. ఇందులో గ్లైసమిక్ సూచి  తక్కువగా ఉంటుంది ఫైబర్ అధిక శాతంలో ఉంటుంది పియర్ పండు కూడా డయాబెటిస్ రోగుల  డైట్ జాబితాలో ఉండాల్సిందే.

ఆరెంజ్..
ఆరెంజ్ కూడా రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెరగనివ్వవు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. గ్లైసమిక్ సూచి కూడా తక్కువగా ఉంటుంది సహజ సిద్ధమైన చక్కరలు ఉంటాయి.

ఇదీ చదవండి:  ఇలా చేస్తే 3 రోజుల్లో మీ జుట్టు ఒత్తుగా.. పొడుగ్గా పెరుగుతుంది..

గ్రేప్ ఫ్రూట్..
గ్రేఫ్రూట్ కూడా సీట్రస్ పండు. ఇందులో గ్లైసమిక్ సూచి తక్కువగా ఉంటుంది. విటమిన్ సి ఉంటుంది అంతే కాదు గ్రేఫ్రూట్లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల డయాబెటిస్ రోగులకు ఇది ఆరోగ్యకరం.

ప్లమ్..
ప్లం పండులో క్యాలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. అయితే ప్లంలో గ్లైసమిక్ సూచి తక్కువగా ఉండటం వల్ల డయాబెటిక్ రోగులకు మంచివి. ప్లమ్ పండ్లను తాజాగా తీసుకోవచ్చు లేకపోతే స్నాక్ గా కూడా తీసుకోవచ్చు.

పీచ్ పండు..
పీచ్ లో క్యాలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. అలాగే గ్లైసమిక్ సూచి కూడా తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ రోకులకు ఆరోగ్యకరం. పీచ్ పండ్లు విటమిన్ ఏ ఉండటం వల్ల ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు పీచ్ పండ్లు విటమిన్ సి  తో పాటు ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.

ఇదీ చదవండి: ఈ బీట్‌రూట్‌ లిప్‌ బామ్‌ ఇంట్లోనే తయారు చేసుకోండి.. మీ పెదాలు సహజసిద్ధంగా పింక్ రంగులోకి మారిపోతాయి..

అప్రికట్స్..
ఇందులో కూడా ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది డయాబెటిస్ రోగులకు మంచిది ఆప్రికట్లో విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గ్లైసమిక్ సూచి తక్కువగా ఉంటుంది.

 గ్రేప్స్..
గ్రేప్స్ లో గ్లైస మిక్స్ సూచి సాధారణంగా ఉంటుంది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల డయాబెటిక్ రోగులు డైట్లో చేర్చుకోవాలి. గ్రేప్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంటే కాదు ఇందులో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News