Natural Pink Lips: ఈ బీట్‌రూట్‌ లిప్‌ బామ్‌ ఇంట్లోనే తయారు చేసుకోండి.. మీ పెదాలు సహజసిద్ధంగా పింక్ రంగులోకి మారిపోతాయి..

Natural Pink Lips with beetroot:  లిప్‌ బామ్‌ ఇంట్లో తయారు చేసుకుంటే ఎంతో సహజ సిద్ధంగా ఉంటుంది. మీ పెదాలకు న్యాచురల్ రంగు వస్తుంది. మీ పెదాలు పింక్ రంగులోకి మారిపోతాయి బీట్‌ రూట్‌  లిప్‌ బామ్‌ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Jun 1, 2024, 10:39 PM IST
Natural Pink Lips: ఈ బీట్‌రూట్‌ లిప్‌ బామ్‌ ఇంట్లోనే తయారు చేసుకోండి.. మీ పెదాలు సహజసిద్ధంగా పింక్ రంగులోకి మారిపోతాయి..

Natural Pink Lips with beetroot:  లిప్‌ బామ్‌ ఇంట్లో తయారు చేసుకుంటే ఎంతో సహజ సిద్ధంగా ఉంటుంది. మీ పెదాలకు న్యాచురల్ రంగు వస్తుంది. మీ పెదాలు పింక్ రంగులోకి మారిపోతాయి బీట్‌ రూట్‌  లిప్‌ బామ్‌ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీంతో మీ పెదాలు నేచురల్ గా పింక్ రంగులో కనిపిస్తాయి.

కావలసిన పదార్థాలు..
 గ్రేట్ చేసిన బీస్ వ్యాక్స్ -ఒక టేబుల్ స్పూన్ 
కోకోనట్ ఆయిల్ -ఒక టేబుల్ స్పూన్ 
బాదం ఆయిల్ -1/2 టేబుల్ స్పూన్
 బీట్రూట్ పౌడర్ -1/2 టేబుల్ స్పూన్
విటమిన్ ఇ ఆయిల్

బీట్‌రూట్‌ లిప్‌ బామ్‌ తయారు చేసుకునే విధానం..
నాచురల్ గా ఈ లిప్‌ బామ్‌  చేయాలంటే డబుల్ బాయిలర్ పద్ధతిని ఉపయోగించాలి. అంటే స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి అందులో నీళ్లు పోసి మీరు మరో చిన్న పాత్ర పెట్టుకొని అందులో ఈ లిప్‌ బామ్‌  తయారు చేసుకోవాలి. డైరెక్ట్ హిట్ పెట్టకూడదు. డబుల్ బాయిలర్ పద్ధతిలో ఉన్న చిన్న పాత్రలో ఈ బీస్ వ్యాక్స్ కొబ్బరినూనె, ఆల్మండ్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి ఇది పూర్తిగా కరిగిపోవాలి.

ఇదీ చదవండి: ఈ ఫ్రూట్‌ ఫెషియల్ ఇంట్లో చేసుకుంటే మీ ముఖానికి రెట్టింపు గ్లో..

అందులో బీట్రూట్ పౌడర్ కూడా వేయాలి అప్పుడు మంచి పింక్ కలర్ లోకి మారిపోతుంది. ఇందులో మీకు కావాలంటే విటమిన్ ఈ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మంచి పోషకాలు కలిగి ఉంటాయి ఇది మీ పెదాలను మాయిశ్చర్ గా ఉంచుతుంది. బీట్రూట్ పొడి మొత్తం మిక్స్ అయ్యేవరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ మొత్తాన్ని ఒక లిబ్బం కంటైనర్ లో వేసుకోవాలి దీని కాసేపు ఆరనివ్వాలి దీనికి కొన్ని గంటల సమయం పడుతుంది. రూమ్ టెంపరేచర్ బట్టి దీన్ని చల్లార్చుకోవాలి.

ఇదీ చదవండి: ఈ 5 మార్నింగ్ డ్రింక్స్‌ తీసుకుంటే శరీరాన్ని డిటాక్సిఫై చేయడమేకాదు, బరువు కూడా తగ్గించేస్తుంది..

లిప్‌ బామ్‌  చల్లారిన తర్వాత తడి లేని పొడి ప్రదేశంలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఈ లిప్‌ బామ్‌ మీ పెదాలకు న్యాచురల్ గా పింక్ కలర్ ఇస్తుంది. అయితే ఏ కొత్త రకమైన పదార్థాలు మీ శరీరంపై ఉపయోగించిన కానీ ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే కొంతమందికి కొన్ని రహకాల వస్తువులు అలర్జీని తీసుకువస్తాయి. ఇందులో మీకు కావాలంటే బీట్‌రూట్‌ పొడిన తర్వాత కూడా యాడ్ చేసుకుని మంచి రంగు వచ్చేలా కలుపుకోవచ్చు. అంతేకాదు బీట్రూట్ కి బదులుగా దానిమ్మ పౌడర్ రాస్బెర్రీ పౌడర్ కూడా ఉపయోగించవచ్చు దీంతో మంచి రంగులలో ఉన్న లిప్‌ బామ్‌  రెడీ అవుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News