Constipation Relief: మలబద్ధకాన్ని జాడించి తన్నే అద్భుత ఔషధం ఈ ఒక్క రసం..!

Constipation Relief: కడుపులో అజీర్తి, గ్యా,స్ మలబద్దకం, గుండె మంట వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది అనారోగ్యకరమైన జీవనశైలి ,ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడం సరైన మోతాదులో నీటిని తీసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుంది.

Written by - Renuka Godugu | Last Updated : Jun 6, 2024, 10:42 AM IST
Constipation Relief: మలబద్ధకాన్ని జాడించి తన్నే అద్భుత ఔషధం ఈ ఒక్క రసం..!

Constipation Relief: కడుపులో అజీర్తి, గ్యా,స్ మలబద్దకం, గుండె మంట వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది అనారోగ్యకరమైన జీవనశైలి ,ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడం సరైన మోతాదులో నీటిని తీసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. మలబద్ధకం అనేది తరచుగా వచ్చే ఆరోగ్య సమస్య. దీనికి ఎక్కువ మోతాదులో నీళ్లు తీసుకోవాల్సి ఉంటుంది. దీనితో మలబద్ధక సమస్యకు చెక్ పెట్టవచ్చు. అయితే కొన్ని రకాల జ్యూసులతో కూడా మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం.

నీరు..
నీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మలబద్దక సమస్యకు తక్షణ రెమెడీ. నీటిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కడుపున శుభ్రం చేస్తుంది. జీవన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు 10 గ్లాసుల వరకు నీటిని తీసుకోవాలి. మలబద్ధకం పెద్ద సమస్యకు చెక్ పెడుతుంది.

చియా సీడ్ నీళ్లు..
చియ విత్తనాలు ఆ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధక సమస్యకు చెక్ పెడుతుంది. ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు చియా సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జీవన ఆరోగ్యానికి సహకరిస్తాయి. అంతేకాదు పేగు ఆరోగ్యానికి కూడా తోడ్పడుతాయి. అంటే ప్రతిరోజు చియా సీడ్స్ నానబెట్టిన నీటిని తీసుకోవాలి. ముఖ్యంగా కనీసం రెండు గంటల ముందు అయినా చియా సీడ్స్ నీటిలో నానబెట్టాలి. ఈ నీటిని తీసుకోవడం వల్ల అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.

ఇదీ చదవండి: బిల్వపత్రం పరగడుపున తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో చూడండి..

నిమ్మ నీరు..
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో సీట్రిక్ యాసిడ్ ఉంటుంది. దీని వల్ల మద్దపెద్దకు సమస్యకు చెక్ పెడుతుంది. డయేరియా ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నవారు నిమ్మరసం తీసుకోవాలి. దీన్ని తీసుకోవడం వల్ల రోజంతట శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.

తాజా పండ్లు..
తాజా పండ్లను కూడా డైట్లో చేర్చుకోవడం వల్ల మలబద్ధకం లక్షణాలు తగ్గిపోతాయి. కడుపు సమస్యలకు తక్షణ రెమిడి ఇందులో విటమిన్స్ ,మినరల్స్ ,ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతాయి. ముఖ్యంగా ప్రూన్‌ జ్యూస్ మలబద్ధక సమస్యలకు ఎఫెక్టివ్ రెమిడీ. ఇది స్త్రీలకు కూడా దివ్యౌషధం.

ఇదీ చదవండి: ఒక్క టమాటా చాలు రక్తపోటుకు చెక్‌ పెట్టడానికి.. ఈ 5 విషయాలు తెలుసుకోండి..

కాఫీ..
కాఫీ కూడా కాని మలబద్ధక సమస్యను తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. కొన్ని నివేదికల ప్రకారం కాఫీలో యాసిడ్స్ ఉంటాయి. ఇది హార్మోన్ గ్యాస్ట్రిన్ ని పెంచేలా చేస్తాయి దీంతో పేగు ఆరోగ్యకరమైన కదలికలకు తోడ్పడుతుంది దీంతో మలబద్ధక సమస్య కూడా మీ దరిచేరదు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News