Swaroopanandendra: ఏపీలో కొలువు తీరనున్న కొత్త సర్కారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్వరూపానందేంద్ర..

Chandrababu naidu: విశాఖ శారదా పీఠాధి పతి స్వరూపానందేంద్ర సరస్వతి చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఆయన మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఎంతో ఫెవర్ గా ఉండేవారని కొందరు వ్యాఖ్యలు చేస్తుంటారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 10, 2024, 01:05 PM IST
  • ఎవరు తమ వద్దకు వచ్చిన ఉన్నది ఉన్నట్లు చెబుతాం..
  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన స్వరూపానందేంద్ర..
Swaroopanandendra: ఏపీలో కొలువు తీరనున్న కొత్త సర్కారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్వరూపానందేంద్ర..

Swaroopanandendra saraswati sensational comments on ap new government:  ఆంధ్ర ప్రదేశ్ లో జూన్ 12 న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే అధికారులు అన్నిరకాల ఏర్పాట్లను శరవేగంగా నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసర పల్లి ఐటీపార్క్ లో.. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. జూన్ 12 న ఉదయం 11.27 నిముషాలకు సింహలగ్నంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. విశాఖ శారాదా పీఠాధి పతి స్వరూపానందేంద్ర సరస్వతి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రంలోను, రాష్ట్రంలోను కొత్తగా ప్రభుత్వాలు ఏర్పాడటం ఆనందగా ఉందన్నారు.

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

ఏపీకి మూడు కేంద్ర మంత్రి పదవులు రావడం శుభసూచకమన్నారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చిన... రాజకీయ నాయకులు, నేతలు, అధికారులు  శారదా మాత ఆశీర్వాదం కోసం వస్తుంటారన్నారు. తమతో మాట్లాడినప్పుడు రాజకీయ నాయకులకు ఉన్నది ఉన్నట్లు గానే చెబుతామన్నారు. ఒకటి ఆశీంచి శారదాపీఠం..  ఎవరికి కూడా వత్తాసు పలికినట్లు మాట్లడదన్నారు. గత ఐదేళ్లలో శారదా పీఠం ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అలానే ఉందని ఎవరి వల్ల తాము ఎలాంటి లాభం పొందలేదన్నారు. తమ చేతు ఎప్పుడు పైన ఉంటూ,  ఒకరికి ఇస్తామే తప్పా.. యాచించమని తెల్చిచెప్పారు. శారదా పీఠం అనేది సంపాదించుకొవాలి, దాచుకొవాలి అనుకునే పీఠంకాదని స్వరూపానందేంద్ర స్పష్టం చేశారు.  గతంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు శ్రీశైలంలో కుంభాభిషేకం చేయోద్దని  చెప్పినట్లు గుర్తు చేశారు.

కానీ తన మాట ఖాతారు చేయకుండా చేసినందుకు ఈరోజు ఏంజరిగిందో అందరికి తెలుసన్నారు. మాఘమాసంలో కుంభాభిషేకం చేస్తే.. పుత్రనాశన అంటారు. ఇప్పుడు.. ఎలాంటి ఫలితాలు వచ్చాయో తెలుసుకదా..అని అన్నారు. గతంలో సింహాచలం, టీటీడీ ఆలయంలో కొన్ని లోపాలు చెబుతు వాటిని సరిదిద్దాలంటూ ప్రభుత్వాలకు, టీటీడీ వారికి లేఖలు రాసినట్లు చెప్పారు. తాము ఎవరికి భయపడి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదని, గతంలో మురళిమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు.. చంద్రబాబు కోసం 2014 లో సభలు పెట్టి ప్రచారం చేశామన్నారు. తనకు ఏబీఎన్ వేమూరి రాధాకృష్ణకు మంచి అనుబంధం ఉందన్నారు. అదే విధంగా చంద్రబాబు సీఎం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

చంద్రబాబు కుటుంబానికి, ఏపీ ప్రజలకు శారదా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా తాము శారదాపీఠం కోసం కొంత భూమిని అమరావతిలో కొన్నామని తెలిపారు.  చంద్రబాబును కొత్తగా పొగుడుతున్నానని అనుకొవద్దని, ఎవరు అధికారంలో ఉన్న, గవర్నర్ లు, పలు రాష్ట్రాల సీఎంలు, వీఐపీలు, ముఖ్యనేతలు తమ వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంటారని స్వరూాపానందేంద్ర అన్నారు.

Read more: Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..

ఇదిలా ఉండగా.. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్వరూప నందేంద్ర , అధికార పార్టీకీ ఎక్కువగా సపోర్ట్ గా ఉండేవారని కొందరు విమర్శిస్తుంటారు. జగన్ కోసం విశాఖలో నిత్యం పూజలు, యాగాలు నిర్వహించేవారని చెబుతుంటారు. అంతేకాకుండా... పీఠం కోసం భూముల విషయంలో కూడా సీక్రెట్ గా క్విడ్ ప్రో కో.. వంటి కార్యక్రమాలు చేపట్టారంటూ కొందరు తరచుగా ఆరోపణలు చేస్తుంటారు. ఏది ఏమైన చంద్రబాబు ప్రమాణ స్వీకారంవేళ విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర  చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News