Benefits Of Orange Peel For Skin: ఆరేంజ్ పండును తిని దాని తొక్కను పడేస్తాం. దీంతో సౌందర్యపరంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆరేంజ్‌లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇవ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడి ఇమ్యూనిట వ్యవస్థను బలపరుస్తుంది. ఆరేంజ్ తొక్కలో ఫ్లేవనాయిడ్స్, ఫైటో కెమికల్స్ కూడా ఉంటాయి. అయితే, ఆరేంజ్ తొక్కను ముఖానికి ఉపయోగించడం వల్ల మీ చర్మం ఆరోగ్యకరంగా మెరుస్తుంది.
ముఖాన్ని మెరిపిస్తుంది..
ఆరేంజ్ తొక్కలో ఉండే సీట్రిక్ యాసిడ్ ముఖాన్ని ఆరోగ్యవంతంగా మెరిపిస్తుంది. వీటి తొక్కల్లో బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. మీ స్కిన్ టోన్ మెరుగుపడుతుంది, ముఖంపై పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది. అంతేకాదు ముఖంపై ఉండే నల్లమచ్చలు, స్కార్స్ తగ్గిపోతాయి. దీంతో మీ ముఖంపై రెట్టింపు రంగు లభిస్తుంది.
మాయిశ్చరైజేషన్..
ఆరేంజ్ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఇది చర్మంపై మంటను తగ్గించి మాయిశ్చర్ అందించి డ్రైస్కిన్ సమస్యను తగ్గిస్తుంది. దీంతో ముఖంపై ఉండే మచ్చలు, దురదలు తగ్గిస్తుంది. ఆరేంజ్ తొక్కలను మీ బ్యూటీ రొటీన్లో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు.
ట్యాన్..
ముఖంపై పేరుకున్న ట్యాన్ తొలగించడానికి స్క్రబ్ మాదిరి ఆరేంజ్ తొక్కను ఉపయోగించవచ్చు. దీంతో ముఖంపై ఉన్న మచ్చలు, గీతలు తగ్గిపోయి, మెలనీన్ ఉత్పత్తిని కూడా నియంత్రిస్తుంది. ముఖం పై ట్యాన్ పూర్తిగా తొలగించి సమర్థవంతంగా ఆరేంజ్ తొక్కలు పనిచేస్తాయి.
ఇదీ చదవండి: కలోంజి గింజలు మీ డైట్ లో చేర్చుకుంటే ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..
యాంటీ ఏజింగ్..
ఆరేంజ్ తొక్క ఆక్సిడేటివ్ స్ట్రెస్ ప్రాణాంతక ఫ్రీ రాడికల్ సమస్య నుంచి బయటపడేస్తుంది. దీంతో ముఖంపై ఉండే రింకిల్స్, నల్ల మచ్చలు, గీతలు లేకుండా వృద్ధాప్య ఛాయల త్వరగ కనిపించకుండా చేస్తుంది. యాంటీ ఏజింగ్ గుణాలు ఆరేంజ్ తొక్కలు కలిగి ఉంటాయి.
యాక్నే..
ఆరేంజ్ తొక్కలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది ముఖంపై ఉండే యాక్నేను తొలగిస్తుంది. అంతేకాదు ముఖంపై ఉండే అదనపు ఆయిల్‌ను గ్రహించేస్తుంది. ఆరేంజ్ తొక్కలు ముఖానికి ఉపయోగించడం వల్ల నల్లమచ్చలు, యాక్నే, స్కిన్ సమస్యలను తగ్గించేస్తుంది. అందుకే తరచూ ఆరేంజ్ తొక్కలను తరచూ మీ బ్యూటీ రొటీన్లో చేర్చుకోవాలి.
ఇదీ చదవండి: వాము నీటిని ఇలా తాగితే బరువు ఇట్టే తగ్గిపోతారు..
ముఖకాంతి..
ఆరేంజ్ తొక్కలను మీ బ్యూటీ రొటీన్లో చేర్చుకోవడం వల్ల మీ ముఖం కాంతివంతంగా మారుతుంది. ఈ తొక్కలు హైడ్రేషన్‌కు బూస్టింగ్ ఇస్తాయి. చర్మం మృదువుగా మారుతుంది. దీంతో రెట్టింపు గ్లో పొందుతారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి