అక్కినేత సమంత తెలుగు ఇండస్ట్రికి పరిచమై సరిగ్గా తొమ్మిదేళ్లు అవుతోంది. " ఏమాయచేశావె ' మూవీతో సమంత తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ విడుదలై 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. కాగా ఈ మూవీలో నాగచైతన్యం -సమంత తొలిసారి జంటగా నటించిన విషయం తెలిసిందే. ఇది నాగచైతన్యకు కెరీర్ లో రెండో సినిమా కాగా సమంతకు అదే మొదటి సినిమా. చైతూ-సమంత ఈ సినిమా నుంచే ప్రేమలో పడ్డారని ఇప్పటికీ టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
" ఏమాయచేశావె '' మూవీ .. అప్పుడే 9 ఏళ్లు పూర్తయిందంటే నమ్మలేం పోతున్నాం కదూ. ఇప్పడే వచ్చి ఇలా వెళ్లినట్లు కదూ.. దీన్ని బట్టి ఈ మూవీ ఎంత ఫ్రెష్ గా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఇందులో నాగచైతన్య-సమంతను చూస్తుంటే వీళ్లకు పెళ్లయిందనే విషయం గుర్తుకురాదు. అలా ఈ జంట సిల్వర్ స్క్రీన్ పై ఎవర్ గ్రీన్ లవర్స్ గా నిలిచిపోయింది .