Airtel vs Jio Plans: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్. ఇక నుంచి ఆ ప్లాన్ వ్యాలిడిటీ పెరిగింది. కేవలం 395 రూపాయలకేు 70 రోజుల ప్లాన్ లభించనుంది. ఇంతకుముందు 56 రోజులే ఉండేది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎయిర్‌టెల్ ప్లాన్ వ్యాలిడిటీ వ్యవధి పెంచింది.
దేశంలో ప్రైవేట్ టెలీకం రంగంలో మూడు కంపెనీలు పోటీ పడుతుంటాయి. ఇందులో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలున్నాయి. అయితే టాప్ 2 కంపెనీల్లో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ఉంటాయి. ఈ రెండు కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ప్లాన్స్ ఆఫర్ చేస్తుంటాయి. ఇటీవలి కాలంలో అందరికీ వ్యాలిడిటీ సమస్యగా మారుతోంది. తక్కువ ధరకు ఎక్కువ రోజులు వ్యాలిడిటీ ఉంటే బాగుంటుందనేది చాలామంది ఆలోచన. ఈ క్రమంలో ఎయిర్‌టెల్ పాత ప్లాన్‌నే సరికొత్త వ్యాలిడిటీతో కస్టమర్లకు అందిస్తోంది. 395 రూపాయల ప్లాన్‌లో 56 రోజులు కాకుండా 70 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది.
ఎయిర్‌టెల్ 395 రూపాయల ప్లాన్‌లో కస్టమర్లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 600 ఎస్ఎంఎస్, 6జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ 5జి డేటా మాత్రం లభించదు. గతంలో వ్యాలిడిటీ 56 రోజులుండేది. ఇప్పుడు 70 రోజులకు పెంచింది. ఎయిర్‌టెల్ కస్టమర్లకు గతం కంటే ఇప్పుడీ ప్లాన్ చౌక కానుంది.
అయితే రిలయన్స్ జియోలో ఇదే ప్లాన్ మరింత చౌకకే లభించనుంది. 395 రూపాయలకు 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే ఎయిర్‌టెల్‌తో పోలిస్తే 14 రోజులు అధికం. జియో ప్లాన్‌తో జియో సినిమా, జియో క్లౌడ్, జియో టీవీ లభిస్తే ఎయిర్‌టెల్ ప్లాన్‌తో ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలు, అపోలో 24 గంటల సేవలు, ఉచిత హెలో ట్యూన్స్,, వింక్ మ్యూజిక్ లభిస్తాయి.
డేటా కంటే కాలింగ్ ఎక్కువగా ఉండేవారికి 395 ప్లాన్ బెస్ట్ ప్లాన్ కాగలదు. ఇందులో లభించే డేటాను ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు వినియోగించుకోవచ్చు.
Also read: Samsung Galaxy S23 Offer: 50MP ట్రిపుల్ కెమేరా, 8GB ర్యామ్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 సగం ధరకే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook