Ap assembly session update: ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరీ గారిని ఎంపిక చేశారు. ఏపీ ప్రజలు టీడీపీకి భారీ మెజార్టీనిచ్చి గెలిపించారు. 163 మంది ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇదిలా ఉండగా చంద్రబాబు.. 2021, నవంబరు 19 న అపోసిషన్ లీడర్ గా ఉన్నప్పుడు, భీషణమైన శపథం చేశారు. అప్పట్లో సీఎంగా వైఎస్ జగన్ ఉన్నారు.
Read more: Viral News in Telugu: కొంపముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో
ఈ క్రమంలో.. ఆయన తనకు సభలో వైసీపీ నేతలు అవమాన పర్చే విధంగా మాట్లాడారని, తన సతీమణి గురించి కూడా అవహేళనగా మాట్లాడారని చంద్రబాబు ఆవేదన చెందారు. దీంతో తీవ్రమైన మనస్తాపంతో.. సభ పూర్తిగా కౌరవ సభగా మారిందని చంద్రబాబు అన్నారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేదాక అసెంబ్లీలో అడుగుపెట్టనంటూ కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా.. అసెంబ్లీని గౌరవ సభగా మారుస్తామని అన్నారు. అప్పటి నుంచి చంద్రబాబు, ప్రజల్లోకి వెళ్లి జగన్ పాలనను ఎండగడుతూ వచ్చారు.
అంతేకాకుండా.. చంద్రబాబు సతీమణి నిజం గెలవాలి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. అటు నారా లోకేష్ కూడా యువగళం పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లారు.ఇదిలా ఉండగా..చంద్రబాబును జగన్ స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు చేయిండం, జైలులో ఉంచడం కూడా టీడీపీ పట్ల ప్రజల్లో కాస్త సానుభూతి వాతావరణం కల్గిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో చంద్రబాబును, జైలులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్లారు. ఆ సమయంలోనే కీలక ప్రకటన చేశారు. టీడీపీ, జనసేన ఎన్నికలలో కలిసి దిగుతాయని ప్రకటించారు.
మరోవైపు.. బీజేపీతో కూడా పొత్తు పెట్టుకొవడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ఎన్నికల ప్రచారంలో కానీ, సీట్ల విషయంలో కానీ ఎక్కడ కూడా భేషజాలకు పోకుండా కూటమి పార్టీ కలిసి పనిచేశారు.ఈ క్రమంలోనే ప్రజలు కూటమికి మంచి మెజార్టీని అందజేశారు.
ఎన్టీఆర్ విగ్రహనికి చంద్రబాబు నివాళులు..
వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరీ ప్రమాణ స్వీకారం చేయించారు.శాసనసభ్యుడిగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,హోం మంత్రి అనిత వంగలపూడి ప్రమాణం, మంత్రి అచ్చెన్నాయుడు ప్రమాణం చేశారు. వీరితో పాటు..సభ నియమాలకు కట్టుబడి ఉంటానని టీజీ భరత్ ప్రమాణం చేశారు.
Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్,ఎన్ఎండీ ఫరూక్ ,ఆర్అండ్బీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఎమ్మెల్యేలంతా ప్రమాణం చేశారు. అదే విధంగా.. ఐటీ మంత్రి నారా లోకేశ్,పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్,పి నారాయణ సభ నియమాలకు కట్టుబడి ఉంటామని ప్రమాణం చేశారు. వీరితో పాటు కూటమి నేతలు, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వరుసగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉండగా రేపు అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరపనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి