IRCTC Ticket Booking: ఐఆర్‌సీటీసీ కొత్త నిబంధన.. ట్రైన్‌ టిక్కెట్‌ ఇలా బుక్‌ చేశారంటే జైలుకే..!

IRCTC Ticket Booking New Rules: ఐఆర్‌సీటీసీ పర్సనల్ ఐడి ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి షాక్ ఇచ్చింది ఇండియన్ రైల్వేస్. టిక్కెట్‌ బుకింగ్‌ విధానంలో కొన్ని మార్పులు చేసింది. ఈ నిబంధనలను అతిక్రమిస్తే జైలు శిక్ష ఖాయం. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Jun 23, 2024, 10:24 AM IST
IRCTC Ticket Booking: ఐఆర్‌సీటీసీ కొత్త నిబంధన.. ట్రైన్‌ టిక్కెట్‌ ఇలా బుక్‌ చేశారంటే జైలుకే..!

IRCTC Ticket Booking New Rules: ఐఆర్‌సీటీసీ పర్సనల్ ఐడి ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి షాక్ ఇచ్చింది ఇండియన్ రైల్వేస్. టిక్కెట్‌ బుకింగ్‌ విధానంలో కొన్ని మార్పులు చేసింది. ఈ నిబంధనలను అతిక్రమిస్తే జైలు శిక్ష ఖాయం. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా మనం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రైలు మార్గంలో వెళ్లాలనుకుంటే సులభతరంగా ఐఆర్‌సీటీసీ పర్సనల్ ఐడీ ద్వారా ట్రైన్‌ టికెట్ బుక్ చేసుకుంటాం. అయితే కొంతమంది మాత్రం ఇతరుల కోసం ట్రైన్ టికెట్ బుక్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఇండియన్ రైల్వే కొత్త నిబంధన తీసుకువచ్చింది. వీటిని అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఇండియన్ రైల్వే యాక్ట్ సెక్షన్ 143 ప్రకారం ఐఆర్‌సీటీసీ పర్సనల్ ఐడి ద్వారా థర్డ్ పార్టీకి టికెట్స్ బుక్ చేస్తే అది చట్టపరంగా నిబంధనను అతిక్రమించినట్టు. దీంతో మూడేళ్ల పాటు జైలు శిక్ష రూ. 10 వేల జరిమానా కూడా విధించనుంది.

ఐఆర్‌సీటీసీ పర్సనల్ ఐడి ద్వారా కేవలం తమ కుటుంబ సభ్యులు మాత్రమే టికెట్స్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఈ ఐడి ద్వారా స్నేహితులకు టికెట్స్ బుక్ చేసినా చట్టాన్ని అతిక్రమించినట్లే. ఇక తత్కాల్ బుకింగ్ ఏసీ టికెట్స్ ఉదయం 10 నుంచి, నాన్ ఏసీ టికెట్స్ ఉదయం 11 గంటల నుంచి ప్రతిరోజూ ప్రారంభం అవుతాయి. వినియోగదారులు ఐఆర్‌సీటీసీ ఐడి ఆధార్ లింక్ చేసిన వారు నెలకు 24 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆధార్ లింక్ లేకపోతే 12 టికెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు. ప్రతి ఐడి పైన 12 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఇది వ్యక్తిగతంగా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా వర్తిస్తుంది. ఈ పరిమితి మించితే చట్టపరంగా చర్యలు ఉంటాయి. 

ఇదీ చదవండి: శ్రీ నగర్ లో 7 వేల మందితో యోగా డే.. మోదీ, షా ల వ్యూహత్మక టార్గెట్ అదేనా.. ?

ఐఆర్‌సీటీసీ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకునే విధానం..
ముందుగా ఐఆర్‌సీటీసీ వెబ్సైట్ లాగిన్ అయి 'బుక్ యువర్ టికెట్' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అందులో మీ బోర్డింగ్ డెస్టినేషన్ అడ్రస్ నమోదు చేయాలి. మీరు ప్రయాణించే తేదీని కూడా నమోదు చేయాలి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌లలో మీ ట్రైన్‌ ఎంపిక చేసుకోవాల్సిన క్లాస్, అవైలబుల్ ట్రైన్స్ ఉంటాయి. ఆ తర్వాత 'బుక్ నౌ' ఆప్షన్ ఉంటుంది. అక్కడ కూడా క్లిక్‌ చేసి ప్యాసింజర్ డీటెయిల్స్ మొబైల్ ఫోన్ నెంబర్ క్యాప్యా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: అంతర్జాతీయ యోగా దినోత్సం జూన్ 21నే ఎందుకు.. ? అసలు విషయం ఇదే.. ?

ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్స్ క్యాన్సిల్ చేసే విధానం..
ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ లో యూజర్ నేమ్, పాస్వర్డ్ తో లాగిన్ అయి ఉండాలి. ఇప్పుడు 'మై అకౌంట్' సెక్షన్ లోకి వెళ్లి బుక్ టికెట్ హిస్టరీ పై క్లిక్‌ చేస్తే డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే అక్కడ మనం బుక్‌ చేసుకున్న టికెట్స్ కనిపిస్తాయి. మీకు అవసరం లేని టిక్కెట్స్‌ క్యాన్సల్ చేసుకునే సదుపాయం ఉంటుంది. అయితే రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. దాని ద్వారా టిక్కెట్స్‌ కేన్సల్‌ చేసుకోవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News