Lover brutally murdered girl friend father with sharp knife in Vijayawada: విజయవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న కూతురు ముందే ఆమె తండ్రిపై ప్రేమోన్మాది కత్తులతో దాడికి తెగబడ్డాడు. బృందావన్ కాలనీలో గురువారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది. భవానీపురంలోని చెరువు సెంటర్‌కు చెందిన కె.శ్రీరామచంద్రప్రసాద్ (56) బృందావన్ కాలనీలో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. నిత్యం భవానీపురం నుంచి రాకపోకలు సాగిస్తున్నాడు. ఆయన కూతురు దర్శిని ఇంజనీరింగ్ సెకంట్ ఇయర్ చదువు తోంది. ఇదిలా ఉండగా.. విద్యాధరపురానికి చెందిన గడ్డం శివమణికంఠ విజ్ఞాన్ విహార్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మణికంఠకు ఇన్‌స్టాలో ధర్శినితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది.
Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..
ఇద్దరు కూడా గత.. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటు న్నారు. ఈ విషయం తెలిసిన శ్రీరామచంద్రప్రసాద్ కుమార్తెను హెచ్చరించాడు. బాగా చదువుకుని జీవితంలో మంచిగా స్థిరపడాలన్నాడు. అంతే కాకుండా.. తన కుమార్తె జోలికి రావద్దని మణికంఠను హెచ్చరించాడు. దీంతో కొద్దిరోజులుగా దర్శిని యువకుడిని పక్కనపెట్టింది. పెళ్లి చేసుకోవాలని మణికంఠ చేసిన ప్రతిపాదనను రిజక్ట్ చేసింది. ఈ ఘటనపై శ్రీరామచంద్రప్రసాద్ కొంతమందిని తీసుకుని మణికంఠ ఇంట్లో పంచాయితీ పెట్టాడు. ఆ తర్వాత మణికంఠ ఇంట్లో రోజూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మణికంఠ తల్లి గురువారం ఇల్లు విడిచి వెళ్లిపోయింది. దీంతో మణికంఠ, యువతి తండ్రి మీద పగ పెంచుకున్నాడు.
గురువారం శ్రీరామచంద్రప్రసాద్ కుమార్తెను తీసుకుని బృందావన్ కాలనీలోని కిరాణా షాపునకు వచ్చాడు. రాత్రి 9 గంటల సమయంలో షాపు మూసేసి ఇద్దరూ ఇంటికి బయల్దేరారు. పగతో రగిలిపోతున్న మణికంఠ కొబ్బరి బొండంలు కొసే కత్తి తీసుకుని బృందావన్ కాలనీకి వచ్చాడు. షాపునకు 100 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టు కింద నిలబడ్డాడు. తండ్రీకూతుళ్లు స్కూటర్‌పై వస్తుండగా, ఎదురుగా వెళ్లి బైకుతో ఢీ కొట్టాడు. కిందపడిపోయిన శ్రీరామచంద్రప్రసాద్‌పై కత్తితో వేటు వేశాడు.
Read more: Snakes Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..
రోడ్డుపై పడిన తండ్రిని దార్శిని పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టగానే మళ్లీ నరికాడు. దర్శిని ఎంత ఆపినా విచక్షణ లేకుండా నరికాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించాడు. తనతో తిరిగిన, ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించాడు. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునే సరికి పరారయ్యాడు. శ్రీరామచంద్రప్రసాద్‌ను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వాసు పత్రి మార్చురీకి తరలించారు. కేసును కృష్ణలంక ఇన్‌స్పెక్టర్ ఆకుల మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మాత్రం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి