Foods Never Keep in kitchen: ఇంటి వంట గది షెల్ఫ్ లో మనం నిత్యం వంటలకు కావాల్సిన ఆహార పదార్థాలను నిల్వ చేసుకొని పెట్టుకుంటాం. ప్రతినెలా లేదా సరుకులు అయిపోయిన ప్రతిసారి మార్కెట్ కి వెళ్లి తీసుకువస్తాం. అయితే ఎక్కువ మొత్తంలో ఇంటి వస్తువులను ఎప్పుడు నిల్వ చేయడం వల్ల త్వరగా ఎక్స్‌పైరీ అయిపోవడం లేకపోతే ఏ వస్తువులు తీసుకురావాలో కూడా తెలియని గందరగోళం ఏర్పడుతుంది. అయితే ఏడు రకాల వస్తువులు మన ఇంటి వంట గదిలో ఎప్పుడు నిలువ చేయకూడదు అది ఏంటో తెలుసుకుందాం.
ఓపెన్ ప్యాక్..
ఇంటి వంటగది షెల్ఫ్ లో ఓపెన్ చేసి ఉన్న ఫుడ్స్ ని ఎప్పుడు కవర్లను నిల్వ చేయకూడదు. ఎందుకంటే ఇందులో గాలి చొరబడుతుంది. దీంతో ఆ ఆహార పదార్థాలు త్వరగా పాడవుతాయి. దాని తాజాదనం కూడా కోల్పోతుంది వీటిపై పెట్టిన ఖర్చు కూడా వృథా అవుతాయి.
పండ్లు కూరగాయలు ..
ఇంటి వంట గది షెల్ఫ్ లో పండ్లు, కూరగాయలు నిల్వ చేయకూడదు. దీంతో ఇతర వస్తువులు కూడా త్వరగా పాడవుతాయి వాసన కూడా వస్తుంది. వీటిని కేవలం ఫ్రిడ్జ్ లోనే నిల్వ చేసుకోవాలి. అంతేకానీ కిచెన్ కౌంటర్ పైన లేదా షెల్ఫ్ లో అస్సలు నిల్వ చేయకండి.
పిండి పదార్థాలు..
అంతేకాదు ఇంటి వంట గదిలో పిండి కూడా పెట్టకూడదు. మీరు పొరపాటున పెడితే వెంటనే తీసేయండి ఇది త్వరగా పాడవుతుంది. ఏదైనా ఖాళీ ఉన్న పరిశుభ్రమైన ప్రదేశంలో మాత్రమే ఈ పిండిని నిల్వ చేయాలి. అప్పుడే ఎక్కువ కాలం పాటు కూడా నిల్వ ఉంటుంది
క్లీన్ చేసే వస్తువులు..
ముఖ్యంగా క్లీన్ చేసే వస్తువులు కూడా వంటగదిలో మనం నిల్వ చేసుకున్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిపై బ్యాక్టీరియా పేరుకుని ఉంటుంది. తరచూ వీటిని క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇది ఆరోగ్యానికి హానికరం తినే వస్తువుల పక్కన ఈ క్లీన్ చేసే గుడ్డలను ఇతర వస్తువులను అసలు పెట్టకూడదు.
ఇదీ చదవండి: ముఖం పై ట్యాన్ పోవట్లేదా? ఈ ఈజీ హోమ్ రెమిడీ తో చెక్ పెట్టండి..
ఎక్స్పైరీ ఫుడ్స్..
అంతేకాదు ఎప్పటికప్పుడు ఎక్స్పైర్ అయిన ఫుడ్స్ ను తనిఖీ చేసి వెంటనే ఇంటి వంట గదిలోంచి తీసేయాలి. దీనికి ప్రతివారం ఇంటి వంటగది వస్తువులపై ఒక నిఘా వేసి పెట్టండి ఎక్స్పైర్ అయిన ఫుడ్స్ ని త్వరగా తీసేయండి.
ఇదీ చదవండి: నోరూరించే రొయ్యల కూర ఇలా వండుకుంటే నోట్లో కరిగిపోతుంది అంతే..
డ్రై ఫ్రూట్స్..
ఒకవేళ మీరు పొరపాటున డ్రై ఫ్రూట్స్ ని ఇంటి వంట గదిలో పెడితే వాటిని వెంటనే తీసేయండి. దీనివల్ల వీటి షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ కాలం పాటు రాదు. డ్రై ఫ్రూట్స్ త్వరగా పాడతాయి. వీటిని కేవలం ఫ్రిడ్జ్ లోనే ప్యాక్ చేసి పెట్టాలి. గింజలు, విత్తనాలు, డ్రై ఫ్రూట్స్ ఫ్రిడ్జ్ లో మాత్రమే నిల్వ చేస్తే ఎక్కువ కాలం పాటు షెల్ఫ్ లైఫ్ వస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి