Chitti Potti: గ్లింప్స్ తో ఆకట్టుకున్న చిట్టి పొట్టి సినిమా.. కథ ఏంటో తెలుసా?

Chitti Potti First Look: త్వరలో డైరెక్టర్ భాస్కర్ యాదవ్ దాసరి స్వీయ నిర్మాణంలో.. తెరకెక్కిస్తున్న.. సినిమా చిట్టి పొట్టి. రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి మెయిన్ లీడ్స్ గా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. చిత్ర బృందం సినిమాకి సంబంధించి.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.. భాస్కర్ యాదవ్.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 3, 2024, 04:01 PM IST
Chitti Potti: గ్లింప్స్ తో ఆకట్టుకున్న చిట్టి పొట్టి సినిమా.. కథ ఏంటో తెలుసా?

Chitti Potti Glimpse: త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిన్న సినిమా చిట్టి పొట్టి. ఆసక్తికరమైన ఈ టైటిల్ తో విడుదల కాబోతున్న ఈ సినిమాకి భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహిస్తున్నారు. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ ఈ సినిమాని నిర్మిస్తోంది. రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. 

సినిమా కథ మొత్తం అన్నా చెల్లెళ్ళ మధ్య ఉండే అనుబంధం గురించి ఉంటుందట. ఈ కాన్సెప్ట్ లో సినిమా వచ్చి చాలా కాలం అయింది. కాబట్టి సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని చిత్ర బృందం భావిస్తోంది. అన్నా చెల్లెళ్ళ మధ్య ఉండే భావోద్వేగాలు, అనురాగాలు, ఆప్యాయతల ఆధారంగా ఈ సినిమా కథ తెరకెక్కిస్తున్నారు. 

పల్లెటూరి బ్యాక్ డ్రాప్ కి వచ్చే ఈ సినిమాలో తెలుగుదనం ఉట్టి పడుతుంది అని సమాచారం. మూడు తరాలలో ఒక ఆడపిల్ల ముందు చెల్లెలిగా, తర్వాత మేనత్తగా, ఆఖరికి బామ్మ గా.. మారే జర్నీ లో ఆమె భావోద్వేగాలు, ప్రేమ, కష్టాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఒక ఆడపిల్లకి పుట్టింటి పైన ఉండే ప్రేమ, మమకారం ఎలా ఉంటుందో ఈ సినిమా కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది. 

అంతేకాకుండా సినిమా మన అందరినీ ఆలచింపచేసేలా ఉంటుందట. ప్రతి ఇంట్లో ఉండే ఆడపిల్ల విలువను అందరికీ తెలిసేలా చేయడమే ఈ సినిమా.. ముఖ్య ఉద్దేశం అని చిత్ర బృందం చెబుతోంది.

తాజాగా చిట్టి పొట్టి టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. రెండిటికీ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా సినిమా గ్లిమ్స్ కు మంచి రెస్పాన్స్.. అందుతోంది. సోషల్ మీడియాలో సినిమాకి సంబంధించిన గ్లిమ్స్, అందులోని డైలాగ్స్ బాగా వైరల్ అయ్యాయి. 

చాలా కాలం తర్వాత వస్తున్న ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉండే సినిమా కాబట్టి.. ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. అన్నీ వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది అని దర్శక నిర్మాత భాస్కర్ యాదవ్ దాసరి అన్నారు.

కాంతమ్మ, ఆచారి, హర్ష, సతీష్, రామకృష్ణ, సరళ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. భాస్కర్ యాదవ్ దాసరి.. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అందించారు. డైరెక్టర్ స్వీయ నిర్మాణం లో ఈ చిత్ర తెరకెక్కుతోంది. శ్రీ వెంకట్ ఈ సినిమాకి ట్యూన్స్ అందించారు. బాలకృష్ణ బోయ ఎడిటర్ గా పని చేస్తున్న ఈ సినిమాకి మల్హర్బట్ జోషి కెమెరా మ్యాన్ గా కనిపించనున్నారు.

Also Read: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలనం.. 9 నెలల యువతి కేసు 9 రోజుల్లో పరిష్కారం

Also Read: C Naga Rani IAS: వెస్ట్‌ గోదావరికి పవర్‌ ఫుల్‌ ఆఫీసర్‌.. ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే అందరికీ హడలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News