Hair growth: వాలుజడ కావాలా.. అయితే ఈ చిట్కా పాటించేయండి.!

Hair growth tips: అవిసె గింజలతో.. తయారుచేసిన హెయిర్ ప్యాక్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల.. జుట్టు మరింత ఒత్తుగా పెరుగుతుంది. మరి అసలు ఆ పాక్ ఎలా చేసుకోవాలి.. దానివల్ల ప్రయోజనం ఏమిటి.. నిజంగానే వాలుజడ మన సొంతమవుతుందా లాంటి విషయాలను ఒకసారి చూద్దాం..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 6, 2024, 10:29 PM IST
Hair growth: వాలుజడ కావాలా.. అయితే ఈ చిట్కా పాటించేయండి.!

Hair growth pack: ఓ వాలుజడా.. అంటూ ఏకంగా  జడ పైన పాటే రాశారు.. మన కవులు. అందుకే చాలామంది అమ్మాయిలు పొడవు జుట్టు కావాలి.. అని కోరుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఉన్న కాలంలో జుట్టు మెయింటైన్ చేయడం అంత సులభమైన పనేమీ కాదు. కావలసినంత పోషకాలు మన శరీరానికి అందించడమే కాదు జుట్టుకు.. కూడా శోషణ ఇవ్వడం తప్పనిసరి. ఇకపోతే జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడం వల్లే మగవారిలో,  ఆడవారిలో జుట్టు రాలే సమస్య అధికంగా.. కనిపిస్తోంది.  పైగా చుండ్రు,  దురద వంటి సమస్యల వల్ల.. కూడా జుట్టు అధికంగా రాలిపోతూ ఉంటుంది .. మరి ఇలాంటి సమస్యలన్నింటినీ దూరం చేసి జుట్టు ఒత్తుగా.. ఆరోగ్యంగా పెరగాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

జుట్టు ఆరోగ్యానికి అవిసె గింజలు..

జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరగడంలో అవిసె గింజలు ప్రధానంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు,  ఫైబర్లు శరీరానికే కాదు జుట్టుకు కూడా మేలు చేస్తాయి. ముఖ్యంగా ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు చర్మం,  జుట్టు కుదుళ్లు  ఆరోగ్యానికి మేలు చేసి.. కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడతాయి. ఇక అవిసె గింజలను హెయిర్ ప్యాక్ గా వేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా.. ఒత్తుగా పెరుగుతుంది.

అవిస గింజలతో హెయిర్ ప్యాక్ తయారీ..

అయితే ఈ అవిసె గింజలతో హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేయాలి అనే విషయానికి వస్తే.. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు అవిసె గింజలు.. 6 కప్పుల నీళ్లు వేసి బాగా మరిగించాలి. నీళ్లు సగానికి రాగానే స్టవ్ మీద నుంచి దించి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆ నీరు జెల్ లా మారుతుంది.. ఒక పల్చటి శుభ్రమైన క్లాత్ తీసుకొని జెల్ నుంచి అవిసె గింజలు వడకట్టాలి. వడకట్టిన జల్ కి అయిదు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలిపి.. బాగా మిక్స్ చేయాలి.. ఇక అంతే అవిసె గింజల హెయిర్ ప్యాక్ రెడీ.

అప్లై చేయడం ఎలా..

సిద్ధం చేసి పెట్టుకున్న హెయిర్ ప్యాక్ ను చేతుల్లోకి తీసుకొని.. జుట్టు మాడుకు ఫింగర్ టిప్స్ తో బాగా మర్దనా చేయాలి.. ఆ తర్వాత జుట్టు కొనల వరకు అప్లై చేసి జుట్టు ముడిపెట్టి అరగంటసేపు బాగా ఆరనివ్వాలి.. ఆ తర్వాత మైల్డ్ షాంపూ తో గోరువెచ్చని నీటిని ఉపయోగించి శుభ్రం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేశారంటే జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరగడమే కాదు చాలా సిల్కీగా,  షైనీగా కనిపిస్తుంది. ఇక వాలుజడ మాత్రమే కాదు జుట్టు పెరగాలని కోరుకునే వారు కూడా ఈ చిట్కా పాటిస్తే తప్పనిసరిగా జుట్టు పెరుగుతుంది.

Also Read: కాంగ్రెస్ లో నరాలు తేగే ఉత్కంఠ.. రేపే మంత్రి వర్గ విస్తరణ..?.. ఆషాడం ఎఫెక్ట్..

Also Read:​ డిప్యూటీ సీఎం పేరు చెప్పి రైతు సూసైడ్.. భట్టీకి చెక్ పెట్టేదిశగా పావులంటూ జోరుగా చర్చలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News