Mars And Saturn Conjunction Effect: జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం, ప్రతి నెల కొన్ని గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తూ ఉంటాయి. జూలై 6న ఈ అంగారక గ్రహం 60 డిగ్రీల కోణంలో సంచారం దశలో ఉంది. అయితే శని గ్రహం కూడా ఇదే కోణంలో ఉంది. కుజుడు మేష రాశిలోకి సంచారం చేసినప్పుడు, శని కుంభ రాశిలో తిరోగమనంలో ఉన్నప్పుడు ఇలా రెండు గ్రహాలు ప్రత్యేక కోణాల్లో ఉంటాయి. అలాగే ఈ రెండు గ్రహాలు కలయిక కారణంగా కూడా 60 డిగ్రీల కోణాలు ఏర్పడతాయి. ఇలా దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఒక్కసారి మాత్రమే జరుగుతూ ఉంటుంది. అయితే ఈ గ్రహాలు ప్రత్యేక కోణాల్లో ఉండడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మేష రాశి:
కుజుడు, శని కలయిక కారణంగా మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వీరికి కొత్త సంబంధాలు ఏర్పడతాయి. అంతేకాకుండా కెరీర్‌కి సంబంధించిన విషయంలో కూడా అనేక మార్పులు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఉద్యోగాలు కూడా వీరు ఎంతో సులభంగా పొందుతారు. అంతేకాకుండా ఈ సమయం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయం చాలా వరకు కలసి వస్తుంది. ఈ సమయంలో వీరు డబ్బులు ఆదా చేయడమే కాకుండా కొత్త కొత్త ఆస్తులు కొనుగోలు చేసే ఛాన్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం కూడా పెరిగి అనుకున్న పనులు చేయగలుగుతారు. దీంతో పాటు ధైర్యం కూడా వీరికి విపరీంతంగా పెరుగుతుంది. అలాగే భాగస్వామ్య జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
వృషభ రాశి:
ఈ రెండు గ్రహాల కలయిక వృషభ రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు పూర్తీకుల అస్తులు పొందడమే కాకుండా అనుకున్న పనుల్లో సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా శని అనుగ్రహం లభించి వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఉద్యోగాల్లో ప్రశంసలు కూడా లభిస్తాయి. అలాగే పెట్టుబడులు పెట్టడం వల్ల అనుకున్న ఫలితాలు కూడా పొందుతారు. అలాగే వ్యాపారాలు చేసేవారు పెద్ద పెద్ద డీల్స్ కూడా పొందుతారు. వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
మిథున రాశి:
కుజుడు, శని కలయిక కారణంగా మిథున రాశివారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రభావం కారణంగా గతంలో నిలిపోయిన పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం చాలా అనుకులంగా ఉంటుంది. అంతేకాకుండా పనులు కూడా వెంటనే పూర్తవుతారు. దీంతో పాటు వీరు విదేశాలకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి