కోల్‌కతా: ఐపిఎల్ 12వ సీజన్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన 2వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్‌కి దిగింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (85), బెయిర్‌స్టో (39) జట్టుకు ఒకింత భారీ స్కోర్‌ని అందించడంలో తమవంతు పాత్ర పోషించారు. పియూష్ చావ్లా బౌలింగ్‌లో బెయిర్‌స్టో క్లీన్ బౌల్డ్ కాగా ఆ తర్వాత కొద్దిసేపటికే రస్సెల్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ ఊతప్పకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన యుసుఫ్ పఠాన్ ఒక్క పరుగుకే రస్సెల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇన్నింగ్స్ చివర్లో విజయ్ శంకర్ (39) పరుగులు జోడించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 181 పరుగులు చేయగలిగింది. 182 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు హైదరాబాద్ జట్టుపై పైచేయి సాధిస్తుందో లేదో వేచిచూడాల్సిందే మరి.
సన్‌రైజర్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్: మెరిసిన వార్నర్