టికెట్ రాలేదని టీడీపికి షాక్ ఇచ్చిన కేంద్ర మాజీ మంత్రి !

టికెట్ రాలేదని టీడీపికి షాక్ ఇచ్చిన కేంద్ర మాజీ మంత్రి !

Last Updated : Mar 31, 2019, 10:39 AM IST
టికెట్ రాలేదని టీడీపికి షాక్ ఇచ్చిన కేంద్ర మాజీ మంత్రి !

కడప: లోక్ సభ ఎన్నికలకు తేదీ సమీపిస్తున్న తరుణంలో ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి షాక్‌నిస్తూ కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో తనకు సముచిత స్థానం కల్పించినందుకు కృతజ్ఞతలు చెబుతూనే ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేతకు పంపించారు. గతంలో పలుమార్లు  రాజంపేట లోక్‌సభ స్థానం ఎన్నికైన ఆయన యూపిఏ హయాంలో మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా పని చేశారు. 2014 ఎన్నికల అనంతరం కొంత కాలంపాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సాయి ప్రతాప్ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 
 
ఏప్రిల్ 11న జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో తనకు కానీ లేదా తన అల్లుడు సాయి లోకేష్‌కు కానీ రాజంపేట స్థానం నుంచి లోక్ సభ టికెట్ ఇవ్వాలని చంద్రబాబును విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే, చంద్రబాబు మాత్రం రాజంపేట లోక్ సభ టికెట్ డీకే సత్యప్రభకు కేటాయించారు. దీంతో చంద్రబాబు వైఖరిపై తీవ్ర అసంతృప్తికి గురైన సాయి ప్రతాప్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీని వీడిన అనంతరం తాను ఏ పార్టీలో చేరాలనుకుంటున్నాననే విషయాన్ని మాత్రం సాయి ప్రతాప్ స్పష్టంచేయలేదు.

Trending News