Rains in Hyderabad: జలదిగ్భంధంలో హైదరాబాద్.. పలుప్రాంతాల్లో కొట్టుకుపోతున్న కార్లు.. వీడియో ఇదే..

Hyderabad: హైదరబాద్ లో ఒక్కసారిగా చిగురుటాకులా వణికిపోయింది. పలు ప్రాంతాలలో ఒక్కసారిగా భారీగా వర్షం కురిసింది. ఎక్కడ చూసిన రోడ్లంతా జలమయమైపోయాయి. వర్షంలో కార్లు కొట్టుకుపోయిన వీడియోలు  ఇప్పుడు వైరల్ గా మారాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Jul 15, 2024, 01:45 PM IST
  • హైదరాబాద్ లో దంచికొట్టిన వాన..
  • రంగంలోకి దిగిన అధికారులు..
Rains in Hyderabad: జలదిగ్భంధంలో హైదరాబాద్.. పలుప్రాంతాల్లో కొట్టుకుపోతున్న కార్లు.. వీడియో ఇదే..

Heavy rain in Hyderabad: వాతావరణ కేంద్రం ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో రానున్న ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీచేసింది. ఈ  నేపథ్యంలో..నిన్న ఒక్కసారిగా వాతావరణ మారిపోయింది. ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది. సాయంత్రం ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. దీంతో మహానగరమంతా చిగురుటాకుల వణికిపోయింది. గంటల కొద్ది వర్షం కుండపోతగా పడింది. దీంతో రోడ్లన్నిఎక్కడికక్కడ జలమయమయ్యాయి. సాధారణ జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఒకవైపు వీకెంట్ కావడంతో, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ తో సరదాగా గడిపేందుకు బైటకు వెళ్లిన వారు తడిసిపోయినట్లు తెలుస్తోంది. 

 

రోడ్లన్ని జలమయం కావడం వల్ల ట్రాఫిక్ కు సైతం తీవ్ర ఆంతరాయం ఏర్పడింది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు. జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి వాటర్ ఆగకుండా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం వల్ల నీళ్లు నాలాల నుంచి బైటకు వచ్చి మరీ ప్రవహించాయి. అనేక గల్లీల గుండా నీటి ప్రవాహం చెరువుల్ని తలపించింది. ముఖ్యంగా రామ్ నగర్, కృష్ణానగర్ వంటి పలు ప్రాంతాలలో కార్లు కొట్టుకు పోయిన సంఘటలు వైరల్ గా మారాయి.  

 నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా కార్లు కొట్టుకుపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. యూసుఫ్‌గూడ ప్రాంతంలోని కృష్ణానగర్‌లో వరదనీరు రోడ్డుపై కారు కొట్టుకుపోయింది. ఈ ఘటన వైరల్ గా మారింది. అదే విధంగా.. ముషీరాబాద్ ప్రాంతంలో వరదలు ఉన్న రహదారిపై మరో కారు ప్రయాణీకులతో సహా కొట్టుకుపోయింది. అక్కడ కారులో అప్పటికే కొందరు ప్యాసింజర్స్ సైతం ఉన్నారు. 

Read more: Snake bite: పాముపగ నిజమా..?.. 40 రోజుల్లో 7 సార్లు కాటు.. 9 వ సారి చస్తానంటూన్న వికాస్ దూబే.. మిస్టరీగా మారిన ఘటన..

ఎంతసేపటికి డోర్ లను ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన అవి తెరుచుకోలేదు. దీంతో వరదలో కొట్టుకుపోతున్న కారును స్థానికులు కారును ఆపి, కారు అద్దాలు పగలగొట్టి కారులోని ఐదుగురు ప్రయాణికులను రక్షించారు. అనేక ప్రాంతాలలో ఇళ్లలోకి వర్షం నీళ్లు వచ్చి చేరాయి. ప్రజలు నీటి ప్రవాహాంతో చాలా ఇబ్బందులు పడ్డారు. నిన్న కొన్ని ప్రాంతాలలో వర్షం వల్ల.. కరెంట్ కోతలు ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రంతా కూడా నిద్రలేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని, నీటి ప్రవాహాన్ని క్లియర్ చేయాలని కూడా చెప్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News