Vitamin B12: విటమిన్ బి12 లోపిస్తే ప్రాణాంతకం కాగలదా, విటమిన్ బి12 ఎందుకు అవసరం

Vitamin B12: శరీర నిర్మాణం, ఆరోగ్యానికి వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ చాలా అవసరమౌతుంటాయి. అలాంటి విటమిన్లలో అత్యంత ముఖ్యమైంది విటమిన్ బి12. విటమిన్ బి12 లోపాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కాగలదు. తస్మాత్ జాగ్రత్త.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 21, 2024, 02:41 PM IST
Vitamin B12: విటమిన్ బి12 లోపిస్తే ప్రాణాంతకం కాగలదా, విటమిన్ బి12 ఎందుకు అవసరం

Vitamin B12: ప్రతి మనిషికి దాదాపు అన్ని రకాల పోషకాలు అవసరం. ఏ ఒక్క విటమిన్ లేదా మినరల్ లోపించినా ఏదో ఒక అనారోగ్య సమస్య ఉత్పన్నమౌతుంటుంది. అయితే ఈ అన్ని విటమిన్లలో విటమిన్ బి12 చాలా కీలకమైందిగా చెప్పవచ్చు. ఎందుకంటే రక్త కణాల నిర్మాణం, పని తీరు, డీఎన్ఏ ఫార్మేషన్ లో విటమిన్ బి12 కీలక భూమిక వహిస్తుంది. అందుకే విటమిన్ బి12 తగిన పరిమాణంలో తప్పకుండా ఉండాలి.

చాలామంది విటమిన్ల లోపాన్ని తేలిగ్గా తీసుకుంటారు. ఇది చాలా ప్రమాదకరం. విటమిన్ల లోపాన్ని నిర్లక్ష్యం చేస్తే గంభీరమైన సమస్యలకు దారి తీయవచ్చు. ముఖ్యంగా విటమిన్ బి12 లోపాన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు ఎందుకంటే విటమిన్ బి12 శరీరంలో అంత కీలక భూమిక వహిస్తుంది. విటమిన్ బి12 లోపముంటే శరీరంలో వివిధ అవయవాల పని తీరు సక్రమంగా ఉండదు. దీర్ఘకాలం అలా వదిలేస్తే ప్రాణాల మీదకు రావచ్చు. విటమిన్ బి12 లోపంతో పని తీరు మందగిస్తుంది. దాంతో చేతులు, కాళ్లలో తిమ్మిరెక్కడం, బలహీనత వంటి సమస్యలు కన్పిస్తాయి. కొన్ని సీరియస్ కేసుల్లో వెన్నెముకపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. 

విటమిన్ బి12 లోపముంటే రక్త కణాల ఉత్పత్తి తగ్గుతుంది. దాంతో న్యూరోలాజికల్ డిజార్డర్ తలెత్తవచ్చు. ఈ సమస్యకు చికిత్స అత్యంత క్లిష్యమైంది. ప్రాణాంతకం కావచ్చు. రక్తం లోపించడం వల్ల అలసట, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావచ్చు. విటమిన్ బి12 లోపం అనేది మానసిక  ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. జ్జాపకశక్తి తగ్గుతుంది. మెదడు పనితీరు సరిగ్గా ఉండదు. మానసిక పరిపక్వత లోపిస్తుంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా గుండె వ్యాధులకు కారణం కావచ్చు. విటమిన్ బి12 లోపముంటే ప్రాణాంతకమైన గుండె వ్యాధులకు కారణం కావచ్చు. 

ఒకవేళ మీకు దీర్ఘకాలంగా అలసట, బలహీనత, చేతులు-కాళ్లలో తిమ్మిరి వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే విటమిన్ బి12 పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే త్వరగా గుర్తిస్తే మందుల ద్వారా ఈ లోపాన్ని సరిచేయవచ్చు. లేదా హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా విటమిన్ బి12 లోపం లేకుండా చూసుకోవచ్చు. విటమిన్ బి12 సహజసిద్ధంగా ఉంటే మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తుల్లో పుష్కలంగా ఉంటుంది. లేదా విటమిన్ బి12 సప్లిమెంట్స్ కూడా మార్కెట్ లో చాలా వరకూ అందుబాటులో ఉన్నాయి.

Also read: Telangana Heavy Rains: తెలంగాణలోని ఈ జిల్లాల్లో రేపటి వరకూ అతి భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ జారీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter

Trending News