Coconut Water Benefits: బీపీ నుంచి గుండె వ్యాధుల వరకూ అన్నింటికీ చెక్ చెప్పే నీళ్లు

Coconut Water Benefits: నిత్య జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల వ్యాధులకు పరిష్కారం ప్రకృతిలో లభించే పదార్ధాల్లోనే ఉంది. వీటిలో అతి ముఖ్యమైంది పోషక పదార్ధాలతో నిండి ఉన్నది కొబ్బరి నీళ్లు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 24, 2024, 05:04 PM IST
Coconut Water Benefits: బీపీ నుంచి గుండె వ్యాధుల వరకూ అన్నింటికీ చెక్ చెప్పే నీళ్లు

Coconut Water Benefits: కొబ్బరి నీళ్లు నిజంగా అమృతంతో సమానం. చాలామంది కేవలం దప్పిక తీర్చేందుకే ఉపయోగుపడతాయని భావిస్తారు. కానీ వాస్తవానికి కొబ్బరి నీళ్లు ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే ఏయే వ్యాధులకు చెక్ పెట్టవచ్చో తెలిస్తే ఇంకెప్పుడూ వదలరు. 

కరోనా సమయంలో వివిధ రకాల ఇన్ ఫెక్షన్ల నుంచి కాపాడుకునే పద్ధతుల్ని అవలంభించడం పెరిగింది. చాలామందికి ఈ విషయంలో అవగాహన వచ్చింది. రోజూ నియమిత పద్దతిలో, పరిమాణంలో కొబ్బరి నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే అంటువ్యాధులు, సంక్రమణ నుంచి రక్షణ పొందవచ్చు. కొబ్బరి నీళ్లు ఇమ్యూనిటీని పెంచుతాయి. తద్వారా ఎలాంటి ఇన్ ఫెక్షన్లు, రోగాలు దరిచేరవు. మరోవైపు కొబ్బరి నీళ్లు స్థూలకాయం లేదా అధిక బరువు సమస్యకు అద్భుతంగా పనిచేస్తాయి. వాస్తవానికి స్థూలకాయం అనేది వ్యాధి కాకపోయినా ఇతర వ్యాధులకు కారణమౌతుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్, రక్తపోటు, డయాబెటిస్, కిడ్నీ వ్యాధులు, గుండె వ్యాధులకు దారితీయవచ్చు. అంటే రోజూ క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల కొద్దిరోజుల్లోనే స్థూలకాయం సమస్య నుంచి బయటపడవచ్చు.

గుండె వ్యాధుల సమస్య ఇండియాలా చాలా ఎక్కువగా ఉంది. హృద్రోగ మరణాలు సాధారణమైపోతున్నాయి కొబ్బరి నీళ్లు రోజూ తాగుతుంటే హార్ట్ ఎటాక్, స్ట్రోక్, కరోనరీ ఆర్టరీ డిసీజెస్, ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్ ముప్పు తగ్గుతుంది. అన్నింటి కంటే ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్యకు చెక్ పెడుతుంది. రోజూ కొబ్బరి నీళ్లు తాగుతుంటే రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొవ్వు కరగడంతో రక్తపోటు సాధారణ స్థాయికి వస్తుంది. ముఖ్యంగా డీ హైడ్రేషన్ సమస్య నుంచి తక్షణం ఉపశమనం కల్గించడంలో కొబ్బరి నీళ్లను మించి మరేవీ పనిచేయవు.

Also read: Diabetes Plants: ఇంట్లో కుండీల్లో పెంచుకునే ఈ 3 మొక్కలతో ఇన్సులిన్ రోగులకు సైతం ఉపశమనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News