August movies : జులై సీజన్ లో థియేటర్లలో చాలా సినిమాలు సందడి చేసినప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఎటువంటి సందడి కనిపించలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో జులై సీజన్ మొత్తం చాలా డల్ గా.. గడిచింది. ఇక దీంతో సినీ ప్రియులు బాగా డీల పడిపోయారు.
ఈ నేపథ్యంలో రాబోయే ఆగస్టు నెలలో.. విడుదల కాబోయే సినిమాలపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ అంచనాలకు తగినట్టుగా.. సినిమాలు థియేటర్లో పర్ఫార్మ్ చేస్తాయా లేదా అన్న విషయంపై చర్చ నడుస్తుంది.
జూలై లో స్ట్రైట్ సినిమాలతో పాటు తెలుగులో ఎన్నో డబ్బింగ్ సినిమాలు కూడా వచ్చాయి. అన్ని సినిమాల మధ్యలో భారీ సినిమా.. అంటే శంకర్ విడుదల చేసిన భారతీయుడు 2 అని చెప్పొచ్చు. భారతీయుడు చిత్రానికి ఉన్న రెస్పాన్స్ బట్టి ఈ మూవీ కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని..అందరూ ఆశించారు. అయితే ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ్లో కూడా డిజాస్టర్ టాక్.. సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాస్ట్ అయింది.
మూవీకి మొదటి షో.. నుంచే నెగటివ్ టాక్ రావడంతో షోలు హౌస్ ఫుల్ కాలేదు. ఇక ఇదే నెలలో విడుదలైన పేక మేడలు,ఆపరేషన్ రావణ్, రాజ్ తరుణ్ పురుషోత్తముడు.. లాంటి సినిమాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్లాయో కూడా తెలియనంత డిజాస్టర్ గా మిగిలిపోయాయి. జూలై 26న విడుదలైన డబ్బింగ్ చిత్రం
రాయన్ మాత్రం హిట్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్స్ రాబడుతుంది.. ధనుష్ హీరోగా నటించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
హాలీవుడ్ మూవీ డెడ్ పూల్ కూడా మంచి హిట్ టాక్ సాధించింది. అంటే జూలై మొత్తానికి సౌత్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన మూవీ రాయన్ అనే చెప్పవచ్చు. ఆగస్టు రానే వచ్చింది.. ఇక ఈ నెలలో సినిమాల సందడి ఎలా ఉంటుంది అన్న విషయంపై కూడా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎన్నో సినిమాలు విడుదలవుతాయి. మరి వాటి వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.
ఆగస్టు 1 న శివం భజే రిలీజ్ అయింది. ఇక ఆగస్టు 15 లోపు.. ఒక అరడజన్ పైగా చిన్న సినిమాలు విడుదలవుతాయి. ఆగస్టు 15న రామ్ పోతినేని డబల్ ఇస్మార్ట్ , రవితేజ మిస్టర్ బచ్చన్ విడుదల కాబోతున్నాయి . ఈనెలాఖరకు నాని సరిపోదా శనివారంని.. రంగంలోకి దించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఈ సినిమాలన్న.. మంచి విజయాలు సాధించి.. బాక్స్ ఆఫీస్ కి మంచి రోజులు తీసుకొస్తాయేమో వేచి చూడాలి. అంతేకాకుండా ఆగస్టు నెలలో రిలీజ్ అయ్యే ఈ చిత్రాలలో.. ఏ మూవీ కలెక్షన్స్ పరంగా రేస్ లో ముందంజలో ఉంటుందో తెలియాలి అంటే ఈ నెలాఖరి వరకు వేచి చూడాల్సిందే.
Also Read: Constable Aspirants: అర్ధరాత్రి మళ్లీ నిరుద్యోగుల ఆందోళన.. దిల్‌సుఖ్‌నగర్ దిగ్బంధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook