Patients misbehave with nurse in west bengal birbhum: కోల్ కతా జూనియర్ డాక్టర్ ఘటన పట్ల ఇప్పటికి కూడా దేశంలో పలు చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సైతం ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన విచారణ జరుపుతుంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికి దర్యాప్తు జరుతుంది. ఈ ఘటనపై వెస్ట్ బెంగాల్ లో ఇప్పటికి డాక్టర్ లు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనకు కారణమైన ఏ ఒక్కర్ని వదలకూడదంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం మమతా బెనర్జీ బాధిత కుటుంబానికి తన సంతాపం తెలియజేస్తునే మరోవైపు పీఎం మోదీకి పలు మార్లు లేఖలను కూడా రాసింది. అత్యాచారానికి పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించే చట్టాలు తేవాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా కోరారు.
ఇదిలా ఉండగా వెస్ట్ బెంగాల్ లో ఈ ఘటన కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. మరోవైపు మమతా బెనర్జీ ఈ ఘటనను బీజేపీ కావాలని రాజకీయాలు చేస్తుందని మండిపడుతుంది. అదే విధంగా బీజేపీ సైతం మమతా సర్కారుకు గట్టిగానే కౌంటర్ సైతం ఇస్తుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సైతం మమతా ప్రభుత్వం తీరును, పోలీసులు, ఆర్ జీ కర్ ఆస్పత్రి తీరు పట్ల గట్టిగానే స్పందించింది. ఈ క్రమంలో ఒక వైపు కోలకతాలో నిరసనలు అట్టుడుకున్న నేపథ్యంలో మరో అమానవీయకర సంఘటన వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాలు..
వెస్ట్ బెంగాల్ లోని బీర్బూలోని ఇలంబజార్ ఆర్యోగ్య కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న హెల్త్ సెంటర్ లో నర్సు ఎమర్సెన్సీ విభాగంలో సేవలు అందిస్తుంది. అయితే.. రోగికి నర్సు సెలైన్ ఎక్కించేందుకు అతని బెడ్ దగ్గరకు వచ్చింది. రాత్రి పూట కావడంతో నైట్ షిఫ్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ వార్డులో రోగితో బాటు అతని బంధువులు కూడా ఉన్నారు. అప్పుడు రోగి నీచంగా ప్రవర్తించాడు.
సెలైన్ ఎక్కిస్తున్న నర్సు ప్రైవేటు భాగాలను తాకుతూ నీచంగా ప్రవర్తించాడు. ఒక్కసారిగా షాక్ కుగురైన నర్సు.. వెంటనే అక్కడున్న సిబ్బందికి తెలిపింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది అక్కడికి చేరుకుని రోగిని ప్రశ్నించగా.. రివర్స్ లో వాళ్లే.. నర్సుపట్లు, సిబ్బందిని దూశిస్తు ఇష్టమున్నట్లు ప్రవర్తించాడు.
దీంతో ఆస్పత్రి సిబ్బంది తమ నిరసనలు తెలియజేశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. నర్సు ఫిర్యాదు మేరకు పోలీసులు పెషెంట్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో మరోమారు వెస్ట్ బెంగాల్ వార్తలలో నిలిచింది. దీనిపై బీజేేపీ నాయకులు మరోసారి మమతా సర్కారుపై మండిపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.