Tirumala Laddu: తిరుపతి లడ్డూలపై టీటీడీ కీలక ప్రకటన.. పుకార్లకు ఫుల్‌స్టాప్‌!

TTD Good News To Devotees: ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుపతి లడ్డూపై వస్తున్న పుకార్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. లడ్డూల కొరత లేదని భక్తులకు అవసరమైనన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 1, 2024, 09:44 PM IST
Tirumala Laddu: తిరుపతి లడ్డూలపై టీటీడీ కీలక ప్రకటన.. పుకార్లకు ఫుల్‌స్టాప్‌!

Tirupati Laddu: కొన్నాళ్లుగా తిరుమల లడ్డూపై వస్తున్న వదంతులు, పుకార్లపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. భక్తులకు అరకొరగా లడ్డూలు సరఫరా చేస్తున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తునికి తగినన్ని లడ్డూలు అందిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. రోజుకు 3.5 లక్షల లడ్డూలు విక్రయానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది.

Also Read: Chandrababu Review: ఆదివారం సెలవు రద్దు.. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించిన సీఎం చంద్రబాబు

తిరుమల లడ్డూపై వస్తున్న పుకార్లపై టీటీడీ ఈవో శ్యామల రావు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక విషయాలపై స్పష్టత ఇచ్చారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాలపై వదంతులు నమ్మవద్దు అని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందిస్తామని స్పష్టం చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఆదివారం ఈవో, అదనపుఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీధర్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
 
Also Read: YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై మాజీ సీఎం జగన్‌ అలర్ట్‌.. వైసీపీ శ్రేణులకు కీలక సూచన

ఈవో మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటు, తగినన్ని 50రూపాయల లడ్డూ  ప్రసాదాలు అందించడమే టీటీడీ లక్ష్యం అన్నారు. స్వామివారిని దర్శించుకోకుండా లడ్డూల కొరకు నేరుగా లడ్డూ కౌంటర్లకు వెళ్ళే భక్తులకు ఆధార్ కార్డు ద్వారా రోజువారి రెండు లడ్డూలు ఇవ్వనున్నట్లు తెలిపారు. టీటీడీ ప్రతిరోజు 3.5 లక్షల లడ్డూలను భక్తులకు  విక్రయిస్తున్నదని.. ఇందులో 2.5 లక్షల లడ్డూలు మాత్రమే భక్తులకు చేరుతున్నాయని వివరించారు. మిగిలిన లక్ష లడ్డూలు దర్శనం టోకెన్లు లేనివారు కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు. 

ఇక లడ్డూలు కొందరు దళారులు భారీగా కొనుగోలు చేసి బయట ప్రాంతాలలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని ఈఓ శ్యామల రావు తెలిపారు. బయట పట్టణ ప్రాంతాల్లో పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పంచుతున్నట్లు మా దృష్టికి వచ్చిందని వివరించారు. టీటీడీ అనుబంధ ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను టీటీడీ విక్రయిస్తోందని చెప్పారు. తిరుమలతో పాటు ఇతర ప్రాంతాలలో ఉన్న శ్రీవారి భక్తులకు కూడా లడ్డూ ప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 

ఐటీ వ్యవస్థ సహకారంతో 3 రోజులుగా భక్తుల ఆధార్ కార్డు నమోదుతో విక్రయిస్తున్న లడ్డూలు ఎవరికి ఇస్తున్నారు, దర్శనం చేసుకొని వారు ఎన్ని లడ్డూలు తీసుకొంటున్నారు, తదితర  విషయాలు నమోదు చేస్తున్నట్లు ఈఓ శ్యామల రావు తెలిపారు. లడ్డూలు పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News