king cobra: బాప్ రే.. ఇంట్లో 11 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. వణికిపోయిన స్నేక్ రెస్క్యూ టీమ్.. షాకింగ్ వీడియో వైరల్..

Big king cobra in odisha: ఒక భారీ సర్పం ఇంట్లోకి ప్రవేశించింది. బాంగ్రా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అక్కడి వారు భయపడిపోయి పాములను పట్టేవారికి సమాచారం ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Sep 3, 2024, 03:37 PM IST
  • ఒడిశాలో హల్ చల్ చేసిన కింగ్ కోబ్రా..
  • రంగంలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బంది..
king cobra: బాప్ రే..  ఇంట్లో 11 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. వణికిపోయిన స్నేక్ రెస్క్యూ టీమ్.. షాకింగ్ వీడియో వైరల్..

11 fit long king cobra snake rescued from house in odisha: కొన్నిరోజులుగా ఎక్కడ చూసిన భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లలోకి నీళ్లు కూడా వచ్చిచేరుతున్నాయి.  మెయిన్ గా అడవులు, చెట్లు, గుట్లలకు దగ్గరగా ఉన్న ఇళ్లలోకి పాములు వస్తుంటాయి. వరదల్లో కూడా పాములు కొట్టుకుని వస్తుంటాయి. అవి ఇంట్లోకి వచ్చి సజ్జల మీద, బట్టలలో, వాహానాల్లో, హెల్మెట్ లు, బూట్లలో కూడా దూరిపోతుంటాయి. అందుకు మిగత కాలాలతో పోలీస్తే వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెబుతుంటారు.

 

ఈ క్రమంలో పాములకు చెందని ఘటనలు తరచుగా వార్తలలో ఉంటాయి. పాముల వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు కూడా పాముల వీడియోలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇదిలా ఉండగా.. ఒడిషాలో జరిగిన ఒక ఇంట్లోకి కింగ్ కోబ్రా ప్రవేశించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు..

ఒడిశాలోని మయుర్ భంజ్ లో ఒక భారీ సర్పం హల్ చల్ చేసింది.  బరిపాడ అటవీ డివిజన్ పరిధిలోని బాంగ్రా గ్రామంలో 11 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా పామును పామును స్థానికులు గమనించారు. వెంటనే పాములను పట్టేవాళ్లకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్నేక్ టీమ్.. అక్కడికి చేరుకుని పామును పట్టే ప్రయత్నం చేశారు.

కానీ అది బుసలు కొడుతూ.. పలు మార్లు వారిని కాటేసేందుకు సైతం ప్రయత్నించింది. దీంతో ఫారెస్ట్ అధికారులు, స్నేక్ టీమ్ లు ఎంతో కష్టపడి కింగ్ కోబ్రాను పట్టుకుని దగ్గరలోకి అడవిలోకి తీసుకెళ్లి వదలేశారు. అయితే.. సదరు కింగ్ కోబ్రా పాము.. మానిటర్ బల్లిని వెంబడించే క్రమంలో .. సదరు వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.

Read more: Viral Video: ఆ ఒక్కపనిచేస్తే మొబైల్ రీచార్జ్ చేస్తా.. షాప్ ఓనర్ దుమ్మురేగ్గొట్టిన అమ్మాయిలు.. వైరల్ గా మారిన వీడియో..

ఫారెస్ట్ అధికారి మాట్లాడుతూ.. “పాము 11 అడుగుల పొడవు, 6.7 కిలోల బరువు ఉంది. స్థానిక పశువైద్యునిచే పరీక్షించిన తరువాత, ఈ రోజు ఉదయం పామును అడవిలోకి వదిలేసినట్లు కూడా ఫారెస్ట్ సిబ్బంది చెప్పారు. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News