ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ కాపు రిజర్వేషన్ల రడగ రాజుకుంది. కాపు రిజర్వేషన్లపై జగన్ సర్కార్ స్పష్టత ఇవ్వాలని కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభవం ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. కోర్టులో కేసులు ఉన్నందున రిజర్వేషన్ల అమలు కుదరదన్నట్లు వైసీపీ వారు అంటున్నారు.. అయితే ఎక్కడ స్టే ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో దీనిపై వివరణ ఇచ్చినట్లయితే సంతోషించేవాడినని అన్నారు. నిజంగా రిజర్వేషన్ల విషయంలో కోర్టులో స్టే ఉంటే మళ్లీ ఎన్నికల వరకు నోటికి ప్లాస్టర్ వేసుకుంటామని ముద్రగడ సవాల్ చేశారు.
ఆ పదిలో ఐదు శాతం ఇవ్వాల్సిందే
అగ్రవర్ణపేదలకు కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయిస్తామని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించారని ముద్రగడ గుర్తు చేశారు. దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత జగర్ సర్కార్ పై ఉందని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. వెనకబడిన తమ సామాజికవర్గానికి 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని ఈ సందర్భంగా ముద్రగడ డిమాండ్ చేశారు.
అధ్యయన కమిటీ ఏర్పాటు
అగ్రవర్ణాల పేదలకు కేంద్రం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్ లో కాపులకు ప్రత్యేకంగా 5 శాతం ఇవ్వలేమని జగన్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీంతో కాపు ఆగ్రహించిన కాపు సంఘాలు ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమౌతున్న తరుణంలో అలర్డ్ అయిన ముఖ్యమంత్రి జగన్ నష్టనివారణ చర్యలకు దిగారు. కాపు సామాజికవర్గానికి రిజర్వేషన్లు కల్పించడం, ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై త్రిసభ్య కమిటీని నియమించింది. మంత్రి కన్నబాబు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే అంబటి రాంబాబును కమిటీ సభ్యులుగా నియమిస్తూ సీఎం జగన్ ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. దీనికి కాపు సంఘాలు ఎలా రియాక్ట ్ అవుతాయనేది దానిపై ఉత్కంఠత నెలకొంది.