Floods Compensation: వరద బాధితులకు భారీ ఊరట.. ప్రతి కుటుంబానికీ రూ.16,500 అందిస్తామన్న మంత్రి పొంగులేటి..

Floods Compensation In TG:  అర్హులైన చివరి బాధితుడిని కూడా తమ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. వరదలతో నష్టపోయిన బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.  నిజానికి వరదలతో భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఈ సందర్భంగా నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం కీలక సమీక్ష అత్యున్నత స్థాయిలో నిర్వహించారు.

Written by - Renuka Godugu | Last Updated : Sep 10, 2024, 09:01 AM IST
Floods Compensation: వరద బాధితులకు భారీ ఊరట.. ప్రతి కుటుంబానికీ రూ.16,500 అందిస్తామన్న మంత్రి పొంగులేటి..

Floods Compensation In TG: వరద బాధితులకు భారీ ఊరట కల్పించే విషయాన్ని తెలంగాణ రెవెన్యూ, పౌరసరఫరాల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలూ గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది తమ ఇల్లు, పంటలను సైతం కోల్పోయారు. అక్కడక్కడా ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు భారీ ఊరట కల్పస్తోంది.

నిన్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  వరద బాధితులకు ప్రభుత్వం సాయం అందించనుందని ప్రకటించారు. అర్హులైన చివరి బాధితుడిని కూడా తమ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. వరదలతో నష్టపోయిన బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.  నిజానికి వరదలతో భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఈ సందర్భంగా నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం కీలక సమీక్ష అత్యున్నత స్థాయిలో నిర్వహించారు. ఈ సమీక్షలో వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.16,500 చొప్పున సాయం అందిస్తామని చెప్పారు. ఈ సమీక్షలో సీఎస్‌ శాంతికుమారితోపాటు ముఖ్యమంత్రి సలహాదారు ఇతరులు పాల్గొన్నారు.

 అర్హులైన వరద బాధితులకు తప్పకుండా సాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. జిల్లాల్లో క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేయాలి. ఒక్కో పరిధిలో ఎంత నష్టం జరిగింది? ఎన్ని నిధులు కావాలి? పూర్తి స్థాయి నివేదిక రూపొందించాల్సి ఉంటుందన్నారు. 

ఇదీ చదవండి:  జియో రూ.223 రీఛార్జీప్లాన్‌తో ప్రతిరోజూ 2 జీబీ డేటా.. వ్యాలిడిటీ ఎన్ని రోజులు తెలుసా?

ఈ వరదలు, భారీ వర్షాల వల్ల ఇల్లు కోల్పోయిన బాధితులను గుర్తించడానికి పూర్తి స్థాయి కృషి చేస్తామన్నారు. వారి ఖాతాలో నేరుగా రూ.16,500 జమా చేస్తామన్నారు. సాధారణంగా సీఎం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు పదివేల సాయం అందించాలనుకున్నాం. ఆ తర్వాత దాన్ని రూ.16,500 కు పెంచామన్నారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల ఇప్పటి వరకు 33 మంది ప్రాణాలను కోల్పోయారు. చనిపోయినవారు ముఖ్యంగా కొత్తగూడెం, కామారెడ్డి, వనపర్తి, ములుగు జిల్లాలకు చెందినవారు ఉన్నారు. వారి కుటుంబాలకు కూడా తప్పకుండా ఆదుకుంటాం. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల సాయంతోపాటు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తామని మంత్రి చెప్పారు.

ఇదీ చదవండి: రేపు బ్యాంకులు బంద్‌ ఉంటాయా? శనివారం 7వ తేదీ బ్యాంక్‌ హాలిడేనా? ఓసారి చెక్‌ చేసుకోండి..

ఇదిలా ఉండగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా రెండు లక్షల మంత్రి ప్రభావితమైనట్లు తెలుస్తోంది. పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. సుమారు 358 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ముందస్తు చర్యల వల్ల 2,454 మందిని రక్షించాం, 13,494 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని మంత్రి చెప్పారు.  అంతేకాదు ఈ భారీ వర్షాలు, వరదల వల్ల అనేక రోడ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా కొట్టుకుపోయాయి.

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News