Low Pressure Threat: ఏపీకు పొంచి ఉన్న మరో అల్పపీడనం, తుపానుగా మారుతుందా

Low Pressure Threat: ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పూరీ వద్ద తీరం దాటినా మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 10, 2024, 09:40 AM IST
Low Pressure Threat: ఏపీకు పొంచి ఉన్న మరో అల్పపీడనం, తుపానుగా మారుతుందా

Low Pressure Threat: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 22వ తేదీ వరకు అల్పపీడనం ఏర్పడి, 27వ తేదీ వరకు తీరం సమీపానికి రావచ్చు. పరిస్థితిని బట్టి తుపానుగా మారవచ్చని అంచనా. 

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి పూరి సమీపంలో తీరం దాటింది. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఫలితంగా ఇవాళ ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చు ఏపీలోని మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చు. వాయుగుండం తీరం దాటడంతో ఏపీకు వర్ష ప్రభావం తగ్గింది. 

అయితే ఈ వాయుగుండం ముప్పు ఏపీకు తప్పినా ఇప్పుడు మరో అల్పపీడనం పొంచి ఉందని తెలుస్తోంది. ఈ నెల 20 నుంచి 22 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి 27వ తేదీకి తీరానికి చేరనుంది. ఉత్తరాంధ్రవైపుకు రావచ్చని తెలుస్తోంది. వాతావరణ పరిస్థితిని బట్టి తుపానుగా మారవచ్చు. 

ఏపీలో వర్షపాతం వివరాలు

గత 24 గంటల్లో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరంలో అత్యధికంగా 13.7 సెంటీమీటర్లు, చింతపల్లిలో 13.4 సెంటీమీటర్లు, గంగవరంలో 12.4 సెంటీమీటర్లు, అడ్డతీగలలో 11.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక అనకాపల్లి జిల్లా గొలుగుండలో 11.2 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 11 సెంటీమీటర్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగిలో 10.9 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 10.5 సెంటీమీటర్లు, అనకాపల్లి జిల్లా నాతవరంలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 

Also read: Painkiller Tablets: పీరియడ్స్ సమయంలో మహిళలు పెయిన్ కిల్లర్ మందులు వాడవచ్చా లేదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News