TG High court: హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనాలు.. కీలక తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు..

Ganesh Immersion in Hussainsagar: వినాయక చవితి ఉత్సవాలు దేశంలో ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై పిటిషన్ దాఖలైంది. దీనిపైన హైకోర్టు ధర్మాసనం  కీలక తీర్పు వెలువరించింది.

Written by - Inamdar Paresh | Last Updated : Sep 10, 2024, 06:46 PM IST
  • గణేష్ నిమజ్జనాలపై కీలక తీర్పు..
  • పీఓపీ విగ్రహాల కోసం ప్రత్యేకంగా పాండ్లు..
TG High court: హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనాలు.. కీలక తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు..

Telangana high court on ganesh immersion: దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఊరు, వాడ, పల్లె, పట్నం తేడా లేకుండా ప్రతిచోట కూడా గణపయ్య విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల అయితే.. వెరైటీగా సినిమా స్టైల్ లో మండపాలను సైతం ఏర్పాటు చేసి వినాయకులను ప్రతిష్టించారు.

ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 17 వ తేదీన వినాయక నిమజ్జనం జరుగనుంది. ఈక్రమంలో తెలంగాణ హైకోర్టులో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనంపై పిటిషన్ దాఖలైంది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ప్రభుత్వాలు పట్టించుకోలేదని కూడా లాయర్ వేణుమాధవ్ పిటిషన్ ను వేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టు ఈరోజు( మంగళవారం) విచారించింది.

పూర్తి వివరాలు..

 తెలంగాణ హైకోర్టులో ఈరోజు హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలపై విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో పిటిషన్ దారు.. గతంలో హైకోర్టు వారు ఇచ్చిన మార్గదర్శకాలను ప్రభుత్వాలను పాటిచంలేదని కూడా వాదించారు. దీనిపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. తొలుత ఈ పిటిషన్ ను .. కంటెమ్ట్ ఆఫ్ కోర్టు కింద పరిగణించాలని పిటిషనర్ కోరారు. దీనిపై హైకోర్టు మాత్రం కౌంటర్ ఇస్తూ.. గణేష్ నిమజ్జనం చివరి సమయంలో.. ధిక్కరణ పిటిషన్ సరికాదని రిప్లై ఇచ్చింది. అంతేకాకుండా.. కోర్టు ధిక్కరణపై పిటిషనర్..సరైన ఆధారాలు చూపించడంలో విఫలమయినట్లు కూడా ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. 

2021 లో.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం గణేష్ నిమజ్జనం చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు..ఈ పిటిషన్ లో.. ప్రతివాదిగా హైడ్రాను చేర్చాలంటూ  పిటిషన్ దారు కోరగా..  గత ఆదేశాల సమయంలో హైడ్రా లేదు. అలాంటప్పుడు ఇప్పుడెలా హైడ్రాను పార్టీ చేస్తామని.. హైకోర్టు  ఘాటుగానే కౌంటర్ ఇచ్చింది.

Read more: Viral video: పెళ్లైన 2 నెలలకే ముఖేష్ అంబానీ చిన్నకోడలు రాధిక ప్రెగ్నెంట్..?.. ఈ వీడియో చూశారా..?

ప్రస్తుతం మాత్రం.. హుస్సేన్ సాగర్ లో.. మట్టితో చేసినవి, పర్యావరణహిత గణేష్ ల నిమజ్జనం చేసుకొవాలని హైకోర్టు తెలిపింది. అంతేకాకుండా.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ గణపయ్యల కోసం.. ప్రత్యేకంగా పాండ్ లను ఏర్పాటు చేసుకొవాలని కూడా అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. మరోవైపు.. పిటీషనర్ ప్రత్యేక ఆదేశాలకోసం రిట్ పిటిషన్ వేయవచ్చని కూడా హైకోర్టు స్పష్టం చేసింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News