Ola electric showroom burning in karnataka: కొంత మంది టూవీలర్ , ఫోర్ వీలర్ వాహానాలను కొనుగోలు చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు వాహానాల్లో ఏదో ఒక ఫాల్ట్ ఉంటుంది. అవి కొన్న రెండు మూడు రోజులకే వాటిలో సమస్యలు వస్తాయి. స్టార్టింగ్ ప్రాబ్లమ్ లేదా క్లచ్ లేదా బ్రేక్ లు, ఇంజీన్ ఇలా ఏదో సమస్యలు వస్తుంటాయి. దీంతో ఆయా కంపెనీలే.. వాహానాలను రిపేర్ చేసి కస్టమర్లకు సర్వీస్ ఇస్తుంటాయి. అయితే.. ఇటీవల కాలంలో.. ఎలక్ట్రిక్ వాహానాలు తరచుగా ప్రాబ్లమ్ ఇస్తున్నాయి.
తన స్కూటర్ రిపేర్ చేయలేదని ఓలా షోరూంను పెట్రోల్ పోసి తగలబెట్టిన యువకుడు
కర్ణాటక - కలబురగిలో నదీమ్(26) అనే యువకుడు ఓలా ఎలక్ట్రిక్ షోరూంను పెట్రోల్ పోసి తగలబెట్టాడు.
20 రోజుల క్రితం కొన్న స్కూటర్లో సమస్యలు రావడంతో నదీమ్ రిపేర్ కోసం షోరూం స్టాఫ్‌ను సంప్రదించాడు.
ఎన్ని సార్లు… pic.twitter.com/kltLTH73y7
— Telugu Scribe (@TeluguScribe) September 11, 2024
చాలా మంది కస్టమర్ లు ఎలక్ట్రిక్ వాహానాలను కొనేందుకు భయపడిపోతున్నారు. ఇదిలా ఉండగా.. కర్ణాటకలో ఒక కస్టమర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోలు చేశాడు.అయితే.. అది ప్రాబ్లమ్ ఇవ్వడంతో షోరూమ్ లోకి తీసుకెళ్లాడు. కానీ అక్కడి వాళ్లు మాత్రం పట్టించుకోలేదు. దీంతో అతగాడు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
కర్ణాటకలోని కలబురిగిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మహ్మద్ నదీమ్ అనే 26 ఏళ్ల వ్యక్తి మంగళవారం షోరూమ్‌లో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌లతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఇదే షోరూమ్ లో నదీమ్..నెల రోజుల క్రితం రూ.1.4 లక్షలకు ఈ-స్కూటర్‌ను కొనుగోలు చేశాడు. అయితే, కొనుగోలు చేసిన 1-2 రోజుల తర్వాత, వాహనం బ్యాటరీ, సౌండ్ సిస్టమ్‌తో సాంకేతిక సమస్యలను వచ్చాయి. షోరూమ్ కు వచ్చిన కూడా. . అక్కడి సిబ్బంది పట్టించుకోలేదు.
అతను తన వాహనాన్ని మరమ్మతు చేయడానికి పదేపదే షోరూమ్‌ను సందర్శించాడు.కానీ అతగాడి ప్రాబ్లమ్ మాత్రం సాల్వ్ కాలేదు. దీంతో అతను విసిగిపోయాడు. ఈక్రమంలో ఆగ్రహాంతో రెచ్చిపోయి.. పెట్రోల్ పోసి షోరూమ్‌కు నిప్పంటించాడు. దీంతో షోరూమ్ అంతా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. చూస్తుండానే షోరూమ్ అంతాట మంటలు వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో ఆరు వాహనాలు, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. వెంటనే స్థానికుల సమాచారంలో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను కంట్రోల్ చేశారు.ఈ ఘటనలో రూ.8.5 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో షోరూమ్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు నదీమ్ మీద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.