FD Interest Rates: ఎఫ్‌డిపై అత్యధికంగా 9.45 శాతం వడ్డీ, ఎక్కడో తెలుసా

FD Interest Rates: రిస్క్ లేకుండా అత్యధిక రిటర్న్స్ పొందాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ మంచి ప్రత్యామ్నాయం. అయితే ఒక్కో బ్యాంకు ఒక్కో రకమైన వడ్డీ రేటు చెల్లిస్తుంటుంది. అందుకే ఎఫ్‌డీ చేసేముందు ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో తెలుసుకోవడం అవసరం. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 12, 2024, 11:34 AM IST
FD Interest Rates: ఎఫ్‌డిపై అత్యధికంగా 9.45 శాతం వడ్డీ, ఎక్కడో తెలుసా

FD Interest Rates: ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నప్పుడు ఎవరికైనా ముందుగా కన్పించే ప్రత్యామ్నాయం ఫిక్స్డ్ డిపాజిట్ మాత్రమే. ఎందుకంటే ఇందులో రిస్క్ ఉండదు. రిటర్న్స్ కచ్చితంగా ఉంటాయి. మీరు కూడా అత్యధిక వడ్డీ అందించే ఫిక్స్డ్ డిపాజిట్ కోసం చూస్తుంటే మీ కోసం కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. ఇవి అత్యధికంగా 9.45 శాతం వరకు వడ్డీ అందిస్తాయి. 

ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ, సీనియర్ సిటిజన్ పౌరులకు వివిధ బ్యాంకుల్లో మంచి ఆకర్షణీయమైన వడ్డీ అందుతుంటుంది. బ్యాంకులతో పోలిస్తే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు అత్యధికంగా వడ్డీ చెల్లిస్తుంటాయి. ఇవి పూర్తిగా ప్రైవేట్ రంగానికి చెందినవి అయుంటాయి. ఇవి 1500 రోజుల కాల వ్యవధికి 9.42 శాతం వడ్డీ చెల్లిస్తాయి. 700 రోజుల నుంచి రెండేళ్ల వ్యవధిలో అయితే 9.15 శాతం వడ్డీ అందిస్తాయి. అదే 3-4 ఏళ్ల కాల వ్యవధికైతే వడ్డీ రేటు 8.25 శాతం నుంచి 9.15 శాతం ఉంటుంది. ఇక 730 రోజుల నుంచి 1095 రోజుల వ్యవది కలిగిన ఎఫ్‌డీలపై 8.50 శాతం నుంచి 9.42 శాతం వరకూ వడ్డీ అందుతుంది. 

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీపై అత్యధికంగా వడ్డీ ఆఫర్ చేస్తోంది. 12 నెలల వరకూ ఎఫ్‌డిపై ఈ బ్యాంకు 8.75 శాతం వరకు వడ్డీ చెల్లిస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఇచ్చే వడ్డీ ఇది. సాధారణ పౌరులకు 8 శాతం చెల్లిస్తుంది.

ఇక మరో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ శ్రీరామ్ ఫైనాన్స్ అయితే 12 నెలల కాల వ్యవధి కలిగిన ఎఫ్‌డీపై అత్యధికంగా 7.96 శాతం వడ్డీ చెల్లిస్తోంది. 50 నెలల ఫిక్స్డ్ డిపాజిట్ అయితే సాధారణ పౌరుడు 8.91 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్ అయితే 9.45 శాతం వడ్డీని పొందవచ్చు. 60 నెలల ఎఫ్‌డి అయినా ఇదే వడ్డీ రేటు లభిస్తుంది. ఇందులో 36 నెలలు, 30 నెలలు, 24 నెలల కాల వ్యవధితో కూడా ఎఫ్‌డీలు అందుబాటులో ఉన్నాయి. సీనియర్ సిటిజన్లు అందరికీ 9.45 శాతం వడ్డీ లభిస్తుంది.

Also read: MBBS Merit List: ఏపీలో ఎంబీబీఎస్ కోర్సుల ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News