Post Office RD Scheme: మొక్కై వంగనిది మానై వంగున అని మన పెద్దలు చెబుతుంటారు. పిల్లలకు చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు నేర్పడం వల్ల భవిష్యత్తులో ఉపయోగపడుతాయి. ముఖ్యంగా డబ్బులు ఎలా పొదుపు చేయాలి అనే విషయాన్ని వారికి చిన్నప్పటి నుంచే చెప్పడం చాలా అవసరం. వారికి ఆర్థిక క్రమశిక్షణపై అవగాహన కల్పించాలి. అయితే పిల్లలకు సాధారణంగా పాకెట్ మనీని మనం ఇస్తూ ఉంటాము వారు దానిని పిగ్గీ బ్యాంకులో సేవ్ చేస్తుంటారు. దీని వల్ల ఎలాంటి లాభాలు ఉండదు. కానీ అదే డబ్బును ఈ అద్భుతమైన స్కీం లో జమ చేయడం వల్ల రెట్టింపు లాభాలు పొందవచ్చు. దీని కోసం మీరు కేవలం ప్రతి నెల 500 రూపాయిలు పెట్టుబడి పెడితే వడ్డీతో సహా 35 వేల రూపాయిలు కన్నా ఎక్కువ పొందవచ్చు. ఇంతకీ ఈ పథకం ఏంటి? దీన్ని ఎలా వినియోగించాలి అనేది మనం తెలుసుకుందాం.
ఈ పథకంలో పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది పోస్టాఫీస్ స్కీమ్‌కు సంబంధించినది. ఇందులో పిల్లలు జమ చేసే పిగ్గీ బ్యాంక్ డబ్బులకు వడ్డిని కూడా పొందవచ్చు. దీని రికరింగ్ డిపాజిట్ అని పిలుస్తారు. ఇదీ పొందాలంటే ప్రతినెల డబ్బులు జమ చేస్తే మెచ్యూరిటీ మొత్తం వడ్డితో పాటు లభిస్తుంది. ఉదాహరణకు నెలకు రూ. 500 డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ ప్లస్ వడ్డీతో కలిపి మీరు రూ.35,000 పొందవచ్చు అన్నమాట. ఈ పథకం మనకు బ్యాంక్‌లో కూడా అందుబాటలో ఉంది.కానీ పోస్టాఫీస్‌లో రికరింగ్ డిపాజిట్ ఉపయోగించడం వల్ల ఐదు సంవత్సరాలతో పాటు అద్బుతమైన వడ్డీని అందిస్తుంది. కాబట్టి పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పటినుంచే ఈ స్కీమ్‌ను వాడటం చాలా మంది. ఇందులో మరొక బంపర్ ఆఫర్ ఏంటంటే ప్రతి నెల 100 తో రూపాయలతో జమ చేయడం ప్రారంభించవచ్చు. గరిష్ట డిపాజిట్ పైన ఎలాంటి పరిమితి ఉండదు. అయితే ప్రస్తుతం ఈ రికరింగ్ డిపాజిట్ పైన 6.7 శాంతం వడ్డీ ను అందిస్తున్నారు. కాబట్టి పిల్లల కోసం సంవత్సరానికి 6000 రూపాయలు జమ చేస్తే ఐదు సంవత్సరాలలో 30,000 జమవుతాయి. దీనిపైన 6.7 % వడ్డీకి 5,681 రూపాయలు, మెచ్యూరిటీ సమయానికి 35 వేల 681 రూపాయలు పొందవచ్చు.
కాబట్టి మీరు ఇప్పటినుంచి పిల్లలకి ఇలాంటి ఆర్థిక లాభాల పైన అవగాహన కల్పించడం వల్ల వారికి పెట్టుబడుల పైన అవగాహన పెరుగుతుంది. అంతేకాకుండా ఇంట్లోనే పొదుపు పెట్టుబడి పాతలను మీరు సులభంగా నేర్పించవచ్చు వారికి ఆర్థిక భవిష్యత్తు పైన మెరుగైన మార్గదర్శన్ని అందించవచ్చు.
ఈ స్కీమ్ ఎలా ఓపెన్ చేయాలి
మీ ఇంటి వద్ద ఏదైనా పోస్ట్ ఆఫీస్ శాఖ ఉంటే సరిపోతుంది. అక్కడ పిల్లల పేరు మీద రికరింగ్ డిపాజిట్ ఎకౌంటును తెరవచ్చు. ఈ అకౌంట్ ను 10 సంవత్సరాలు కంటే ఎక్కువ వయసు ఉన్న మైనర్ తన పేరు మీద ఎకౌంటు ఓపెన్ చేయవచ్చు. ఈ రికరింగ్ డిపాజిట్ లో జాయింట్ అకౌంట్ కూడా అందుబాటులో ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.