VIVO X200 Pro launch: 16GB Ram,9400 డైమెన్సిటీతో వివో నుంచి కొత్త ఫోన్ VIVO X200 Pro

VIVO X200 Pro launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి మరో ఫోన్ లాంచ్ కానుంది. అత్యాధునిక డైమెన్సిటీతో 16 జీబీ ర్యామ్‌తో ఈ ఫోన్ మార్కెట్‌లో రానుంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఈ ఫోన్ దుమ్ము దులపవచ్చని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 15, 2024, 01:15 PM IST
VIVO X200 Pro launch: 16GB Ram,9400 డైమెన్సిటీతో వివో నుంచి కొత్త ఫోన్ VIVO X200 Pro

VIVO X200 Pro launch: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివోకు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. కెమేరా, రిజల్యూషన్ రెండూ అద్భుతంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో కొత్త మోడల్ ఫోన్లు లాంచ్ చేస్తుంటుంది. అందుకే మార్కెట్‌లో వివో ఫోన్లకు మంచి ఆదరణ ఉంటుంది. 

వివో నుంచి త్వరలో కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రానుంది. VIVO X200 త్వరలో లాంచ్ కానుంది. అక్టోబర్ 14న మార్కెట్‌లో రానున్న ఈ ఫోన్ హై ఎండ్ మోడల్ VIVO X200 Pro కూడా అందుబాటులో ఉంటుంది. చైనాలోని 3సి సర్టిపికేషన్ కలిగి ఉండటం విశేషం. VIVO X200, VIVO X200 Pro మూడు మోడల్స్‌లో లభ్యం కానున్నాయి. ఈ ఫోన్‌లు 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. పవర్‌ఫుల్ ఆక్టాకోర్ చిప్‌సెట్ కూడా ఉంటుంది. ఇక ర్యామ్ అయితే ఏకంగా 16జీబీ ఉంటుంది. 

వివోకు చెందిన గత మోడల్ ఫోన్లలో డైమెన్సిటీ 9300 చిప్‌సెట్ కలిగి ఉంటే కొత్తగా లాంచ్ కానున్న మోడల్ ఫోన్‌లో 9400 చిప్ సెట్ ఉంటుంది. వివో కంపెనీ బడ్జెట్ నుంచి ప్రీమియం వరకూ అన్ని మోడల్ ఫోన్లు లాంచ్ చేస్తుంటుంది. సెక్యూరిటీ పరంగా సింగిల్ కోర్ టెస్ట్ లో 1531 పాయింట్లు సాధించగా, మల్టీ కోర్ టెస్ట్‌లో 6168 పాయింట్లు అందుకుంది. ఈ ఫోన్ ధర, ఇతర స్పెసిఫికేషన్ల గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

Also read: Vizag Steel plant Issue: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై వైసీపీ వర్సెస్ టీడీపీ విమర్శలు, గంటాను టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News