Ramana Deekshitulu: ఐదేళ్లుగా తిరుమలలో మహాపాపం.. లడ్డు వివాదంపై బాంబు పేల్చిన రమణ దీక్షితులు.. వీడియో..

Tirumala Laddu controvercy: తిరుమల లడ్డు వివాదంపై శ్రీవారి మాజీ ప్రధాన ఆలయ అర్చకులు  రమణదీక్షితులు  స్పందించారు. గత ఐదేళ్లుగా అడ్డు అదుపు లేకుండా.. మహాపాపం నిరాడంబరంగా జరిగిపోయిందన్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Sep 20, 2024, 02:34 PM IST
  • లడ్డు వివాదంపై మండిపడిన మాజీ ఆలయ పూజారీ..
  • చంద్రబాబు వచ్చాక అనేక మార్పులంటూ వ్యాఖ్యలు..
Ramana Deekshitulu: ఐదేళ్లుగా తిరుమలలో మహాపాపం..  లడ్డు వివాదంపై బాంబు పేల్చిన రమణ దీక్షితులు.. వీడియో..

Ramana Deekshitulu Tirumala laddu controvercy: ఆంధ్ర ప్రదేశ్ లో లడ్డు వివాదం ప్రస్తుతం దేశంలో పెనుసంచలనంగా మారింది. దీనిపై ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తిరుమల శ్రీవారి లడ్డును భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎక్కడున్న కూడా... లడ్డును ఇష్టంతో తెప్పించుకుని మరీ తింటుంటారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు  ఇటీవల మాట్లాడుతూ.. గత సర్కారు తిరుమల లడ్డు పవిత్రతను పూర్తిగా నాశనం చేసిందన్నారు.  తిరుమల లడ్డును భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు.

 

అలాంటి లడ్డులో పందికొవ్వు, చేప నూనె వంటి ఆనవాళ్లను టెస్టులలో బైటపడ్డాయి. దీంతో ఇది కాస్త ఏపీలోనే కాకుండా.. దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఏకంగా కేంద్రంహోంశాఖకు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. ఇదిలా ఉండగా.. గతంలో శ్రీవారివద్ద ప్రధాన అర్చకులుగా పనిచేసిన  రమణదీక్షితులు  తాజాగా, ఈ ఘటనపై స్పందించారు. 

పూర్తి వివరాలు.. 

తిరుమల లడ్డులో జంతువులు కొవ్వు, చేప నూనె వంటివి ఉపయోగిస్తున్నారని ల్యాబ్ రిపోర్టులో బైటపడింది. దీనిపై  రమణదీక్షితులు  మండిపడ్డారు. గత ఐదేళ్లులుగా..తాము కళ్లముందే మహాపాపం జరుగుతున్న చూస్తు ఉన్నామని అన్నారు. తాను.. ఒక్కడినే అనేక పర్యాయాలు.. శ్రీ వారి నైవేద్యానికి ఉపయోగించే పదార్థాలు, నాసిరకంవి ఉపయోగిస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఒక్కడినే ధైర్యంగా అనేక ఫిర్యాదులు చేశారన్నారు.

కానీ ఏ ఒక్కరు కూడా తనకు మద్దతు  ఇవ్వలేదన్నారు. లడ్డు గురించిన ప్రస్తుతం వార్తలలో చూస్తుంటే.. ఎంతో భాధ కల్గుతుందని.. తమచేతిలో చాలా సార్లు ఈ ప్రసాదాలకు స్వామి వారికి నైవేద్యంగా పెట్టామని ఆవేదన వ్యక్తం చేశారు.  కల్తీ నెయ్యితో చేసిన ప్రసాదాలను తయారు చేసి నివేదన చేయడం పాపమన్నారు.   ‘‘కొవిడ్ సమయం నుంచి స్వామి వారికి నివేదనలను తగ్గించారని బాదపడ్డారు. తిరిగి పాత దిట్టాన్ని పునరుద్దరించలేదని చెప్పారు.

Read more: Tirumala Laddu: జగన్ కు బిగ్ షాక్.. తిరుమల లడ్డు వివాదంపై కేంద్రం హోంశాఖకు ఫిర్యాదు..

వందల సంవత్సరాలుగా వస్తున్న ఆచారాన్ని మార్చకూడదని కూడా రమణదీక్షితులు పేర్కొన్నారు . సేంద్రియ బియ్యంతో నివేదనలు సమర్పించడాన్ని శాస్త్రం ఒప్పుకోదన్నారు. అదే విధంగా... చంద్రబాబు తనకు అవకాశం ఇస్తే..  తిరుమలలో జరుగుతున్న అపచారాలను దృష్టికి తీసుకెళ్తానన్నారు. మరోవైపు చంద్రబాబు అధికారంలోకి రాగానే.. తిరుమల ప్రక్షాళన స్టార్ట్ అయ్యిందన్నారు. ప్రస్తుతం తిరుమలలో నెయ్యిని.. తమిళనాడులోని.. నందిని డైరీ నుండి నాణ్యమైన నెయ్యిని సరఫరా జరుగుతుందన్నారు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News