India vs Bangladesh: రెండో టెస్టులో విరాట్ కోహ్లీ భారీ తప్పు.. రోహిత్ శర్మ షాకింగ్ రియాక్షన్

India vs Bangladesh 1st Test Highlights: బంగ్లాపై తొలి టెస్టులో భారత్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం 308 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ నాటౌట్ అయినా.. పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఇవ్వగా.. రివ్యూ కోరకుండానే వెళ్లిపోయాడు. రిప్లైలో నాటౌట్‌గా తేలింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 20, 2024, 06:44 PM IST
India vs Bangladesh: రెండో టెస్టులో విరాట్ కోహ్లీ భారీ తప్పు.. రోహిత్ శర్మ షాకింగ్ రియాక్షన్

India vs Bangladesh 1st Test Highlights: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. దీంతో మొత్తం 308 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. శుభ్‌మన్ గిల్ 33 పరుగులు, రిషబ్ పంత్ 12 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. యశస్వి జైస్వాల్ (10), రోహిత్ శర్మ (3), విరాట్ కోహ్లీ (17) తక్కువ స్కోర్లకే వెనుతిరిగారు. ఓవర్‌నైట్ స్కోరు 339/6 తో రెండో రోజు ఆట ఆరంభించిన భారత్.. త్వరగానే ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా (86) సెంచరీ చేజార్చుకోగా.. రవిచంద్రన్ అశ్విన్ 113 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆకాష్‌ దీప్ (17), బుమ్రా (7) త్వరగా ఔట్ కావడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ ఐదు వికెట్లు తీయగా.. తస్కిన్ అహ్మాద్ 3, నహీద్ రానా, హాసన్ మిరాజ్ తలో వికెట్ పడగొట్టారు.

Also Read: Jani master: నేరం ఒప్పుకున్న జానీ మాస్టర్.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించిన పోలీసులు..

అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఆరంభంలోనే జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ తీయగా.. ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీయయడంతో లంచ్ సమయానికి బంగ్లాదేశ్ 26/3తో నిలిచింది. లంచ్ అనంతరం చకచక రెండు వికెట్లు కోల్పోగా లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్ ఆరో వికెట్‌కు 51 పరుగులు జోడించి.. ఆదుకునే ప్రయత్నం చేశారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను రవీంద్ర జడేజా విడదీశాడు. టీమిండియా బౌలర్ల దెబ్బకు చివరకు 149 పరుగులకే ఆలౌట్ అయింది. బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, అకాశ్ దీప్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 

 

మొదటి ఇన్నింగ్స్‌లో 227 పరుగుల ఆధిక్యంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. ఐదు పరుగులు చేసి తస్కిన్ అహ్మాద్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్ (10) కూడా త్వరగా ఔట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ (17) కాసేపు క్రీజ్‌లో కుదుకున్నట్లే కనిపించినా.. ఎల్‌బీడబ్యూ రూపంలో పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. శుభ్‌మన్ గిల్ (33), రిషబ్ పంత్ (12) మరో వికెట్ పడకుండా రోజును ముగించారు.

 

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఔట్ అయిన విధానంపై ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హాసన్ మిరాజ్ బౌలింగ్‌లో రెండో బంతిని బౌండరీని తరలించిన కోహ్లీ.. ఆ తరువాతి బంతికే ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అయితే రివ్యూ కోరకుండానే పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. గిల్‌ను రివ్యూ కోసం అడిగినా.. ఎందుకో తీసుకోకుండా వెళ్లిపోయాడు. రిప్లైలో బంతి బ్యాడ్ ఎడ్జ్‌కు తాకినట్లు క్లియర్‌గా తేలింది. దీంతో రోహిత్ శర్మ షాక్‌కు గురయ్యాడు. ఇందుక సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

Also Read: Singareni Bonus: సింగరేణి ఉద్యోగులకు బంపర్‌ బొనాంజా.. రూ.2 లక్షల దసరా బోనస్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News