RGV Saree: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా సంచలనం సృష్టిస్తోన్న రామ్ గోపాల్ వర్మ శారీ..!

RGV Saree Lyrical Video: రామ్ గోపాల్ వర్మ ఏమి చేసినా అది సంచలనమే. నిజజీవితంలో వివాదాలకు దగ్గరగా ఉండే ఈ డైరెక్టర్.. సినిమా రంగంలో మాత్రం ఎన్నో కొత్త ట్రెండ్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మరోసారి అదే దారి ఫాలో అవుతూ.. తను రాబోయే చిత్రంలో ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా మ్యూజిక్ క్రియేట్ చేశారు ఈ డైరెక్టర్.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Sep 22, 2024, 07:22 PM IST
RGV Saree: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా సంచలనం సృష్టిస్తోన్న రామ్ గోపాల్ వర్మ శారీ..!

Saree Lyrical Video : విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రమైన శారీ నుండి "ఐ వాంట్ లవ్" అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో నవంబర్‌లో విడుదలకానుంది. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ప్రముఖ వ్యాపారవేత్త రవి వర్మ నిర్మించారు. 

"శారీ" చిత్రంలో సత్య యాదు, ఆరాధ్య దేవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు, ఇది కొన్ని నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్. 
రామ్ గోపాల్ వర్మ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించి ప్రేక్షకులను ఆకర్షించడానికి ఈ సినిమాలో ఎన్నో కసరత్తులు చేస్తున్నారు. తన తొలి చిత్రమైన "శివ"లో స్టడీ క్యామ్ ఉపయోగించి, రక్త చరిత్రలో డిజిటల్ కెమెరాలను పరిచయం చేశారు ఈ దర్శకుడు. ఇప్పుడు "శారీ" చిత్రంలో ఆయన సంగీత రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను ప్రయోగించారు.

ఇక ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా తీర్చిదిద్దిన.. “వాంట్ లవ్" పాటను ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయడం చేశారు వర్మ.  ఇదే విషయం గురించి ఆర్జీవీ మాట్లాడుతూ, "మా కొత్త ప్రాజెక్ట్ 'ఆర్జీవీ డెన్ మ్యూజిక్'లో ఏఐ సాయంతో రూపొందించిన సంగీతం మాత్రమే ఉంటుంది. 'శారీ'లో నేపథ్య సంగీతాన్ని కూడా ఏఐ ద్వారా రూపొందించాం" అని చెప్పుకొచ్చారు.

ఈ చిత్రం భారతీయ చలన చిత్రంలో పూర్తి స్థాయిలో ఏఐ సంగీతంతో వచ్చిన మొదటి చిత్రం అని వర్మ గర్వంగా పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ వల్ల మ్యూజిక్ ప్రొడక్షన్ కొత్త దిశలో ముందుకు సాగనున్నది అని తెలియజేశారు.

Also read: Bengaluru Horror: బెంగళూరులో హర్రర్, 25 ఏళ్ల యువతి ముక్కలు ముక్కలుగా ఫ్రిజ్‌లో , అసలేం జరిగింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News