EPFO Pension: మీకు పీఎఫ్ ఎక్కౌంట్ ఉంటే 58 ఏళ్ల తరువాత ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా

EPFO Pension: ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వర్తిస్తుంది. పదేళ్లు పీఎఫ్ సభ్యుడిగా ఉంటే రిటైర్ అయిన తరువాత పెన్షన్ అందుకోవచ్చు. ఈ పెన్షన్ ఎంత వస్తుంది, ఈపీఎఫ్ఓ నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 26, 2024, 04:17 PM IST
EPFO Pension: మీకు పీఎఫ్ ఎక్కౌంట్ ఉంటే 58 ఏళ్ల తరువాత ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా

EPFO Pension: ప్రభుత్వ ఉద్యోగి అయినా లేక ప్రైవేట్ ఉద్యోగి అయినా నెల నెలా ఈపీఎఫ్ కట్ అవుతుంటే రిటైర్మెంట్ తరువాత ప్రయోజనాలు ఉంటాయి. దీనికోసం పదేళ్ల పాటు పీఎఫ్ కట్ అవుతుండాలి. అప్పుడే రిటైర్ అయిన తరువాత పెన్షన్ అందుకునేందుకు అర్హులు. ఈ పెన్షన్ నిబంధనలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఇటీవల ప్రతి ఉద్యోగికి పీఎఫ్ ఎక్కౌంట్ తప్పనిసరిగా ఉంటోంది. పదేళ్లు వరుసగా పీఎఫ్ సభ్యుడిగా ఉండి ఉంటే రిటైర్మెంట్ తరువాత అంటే 58 ఏళ్లకు పెన్షన్ అందుకోవచ్చు. 58 ఏళ్ల తరువాత లేదా అంతకంటే ముందే పెన్షన్ తీసుకోవచ్చు. దీనినే ఎర్లీ పెన్షన్ అంటారు. ఈపీఎఫ్ఓ నిబంధనలు క్షుణ్ణంగా తెలుసుకుంటే మంచిది. మీ వయస్సు 50-58 ఏళ్ల మధ్యలో ఉంటే మీరు ఎర్లీ పెన్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే పెన్షన్ తక్కువ వస్తుంది. 58 ఏళ్లకు ఎంత త్వరగా డబ్బులు విత్ డ్రా చేస్తే పెన్షన్ అంత తక్కువగా ఉంటుంది. అది ఏడాదికి 4 శాతం ఉంటుంది. అంటే 56 ఏళ్ల వయస్సుతో ఈపీఎఫ్ఓ సభ్యుడు డబ్బులు విత్ డ్రా చేసుకోవాలనుకుంటే అతనికి మొత్తం పెన్షన్‌లో 8 శాతం కట్ చేసి 92 శాతం అందుతుంది. దీనికోసం కంపోజిట్ క్లెయిమ్ ఫామ్ సమర్పించాల్సి ఉంటుంది. 

58 ఏళ్ల తరువాత కూడా ఆ సభ్యుడు ఉద్యోగంలో ఉంటే తన పెన్షన్‌ను మరో రెండేళ్లకు నిలుపుకోవచ్చు. అంటే 60 ఏళ్ల వయస్సులో కూడా పెన్షన్ కంటిన్యూ చేయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ పెన్షన్ పొందే ఆప్షన్ ఉంటుంది. నిబంధనల ప్రకారం 58 ఏళ్లు దాటాక ఏడాదికి 4 శాతం చొప్పున యాడ్ అవుతుంది. అంటే 60 ఏళ్లకు పెన్షన్ తీసుకుంటే 8 శాతం అదనంగా వస్తుంది. 

మీరు ఉద్యోగం చేసిన సమయం పదేళ్ల కంటే తక్కువ ఉండి ఆ తరువాత పీఎఫ్ కంట్రిబ్యూషన్ చేయకపోతే పెన్షన్ లభించదు. అప్పుడు మీకు రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి పీఎఫ్ నగదుతో పాటు పెన్షన్ నగదును కూడా విత్ డ్రా చేసుకోవడం. రెండవది మళ్లీ ఉద్యోగంలో చేరాలనుకుంటే పెన్షన్ స్కీమ్ సర్టిఫికేట్ తీసుకోవడం. 

Also read: Bank Holidays October 2024: అక్టోబర్‌లో అన్నీ సెలవులే, 15 రోజులు మూతపడనున్న బ్యాంకులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News