Devara 1st Day Collections: బాక్సాఫీస్ పై ఎన్టీఆర్ సునామీ.. దేవర మాస్ ఊచకోత..

జూనియర్‌ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ  'దేవర'. అరవింద సమేత వీరరాఘవ తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందకు తగ్గట్టే తొలిరోజే ఈ సినిమా కలెక్షన్స్ అదిరిపోయాయి.  వరల్డ్ వైడ్‌గా తొలిరోజు దేవర 140 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 28, 2024, 03:08 PM IST
Devara 1st Day Collections: బాక్సాఫీస్ పై ఎన్టీఆర్ సునామీ.. దేవర మాస్ ఊచకోత..

Devara 1st Day Collections: జూనియర్‌ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ  'దేవర'. అరవింద సమేత వీరరాఘవ తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందకు తగ్గట్టే తొలిరోజే ఈ సినిమా కలెక్షన్స్ అదిరిపోయాయి.  వరల్డ్ వైడ్‌గా తొలిరోజు దేవర  రూ.172 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో తొలిరోజు రూ.  70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు సమాచారం. ఇక హిందీలో రూ. 7 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది. . మిగతా భాషలతో పాటు ఓవర్సీస్‌లో కలుపుకొని రూ.140 కోట్లపై వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర మాస్ ఊచకోత కోసింది.ఇప్పటికే యూఎస్  ప్రీమియర్స్ ద్వారానే $ .2.8 మిలియన్ యూఎస్ డాలర్స్ ను కలెక్ట్ చేసింది. మొత్తంగా తొలి రోజు అక్కడ $ 3.5 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. లాంగ్ రన్ ఈ మూవీ ఏ మేరకు అక్కడ వసూళ్లను రాబడుతుందో  చూడాలి. ఇక నైజాంలో ఈ సినిమా రూ. 23 కోట్ల షేర్ రాబట్టి.. ఆర్ఆర్ఆర్ తర్వాత సెకండ్ ప్లేస్ లో నిలిచింది.

మొత్తంగా అరవింద్ సమేత వీరరాఘవ మొత్తం నైజాం వసూళ్లను ఇక్కడ ఫస్ట్ డేనే బీట్ చేయడం మామములు విషయం కాదు. ఇక సీడెడ్ రాయలసీమలో దాదాపు రూ. 11 కోట్ల షేర్ తో ఆర్ఆర్ఆర్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. మొత్తంగా మిక్స్ డే టాక్ ఈ రేంజ్ వసూళ్లను రాబట్టిన 'దేవర' టోటల్ రన్ లో ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.

ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !

ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News