INDIA RAINS: ఉత్తర భారతాన్ని వరుణ దేవుడు వీడటం లేదు. పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లో కొన్ని చోట్ల, తూర్పు ఉత్తర ప్రదేశ్ లో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో పాటు పలు చోట్ల గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని టెరాయ్ ప్రాంతంలో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య బుందేల్‌ఖండ్ ప్రాంతంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 29 నుంచి వర్షాల తీవ్రత తగ్గుతుందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. భారీ వర్షాల కారణంగా యూపీలోని అనేక ప్రాంతాల్లో స్కూళ్ల కు సెలవులు ప్రకటించారు.
మహారాష్ట్రతో పాటు బీహార్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. బిహార్‌లో భాగమతి ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుండగా, కోసి, గండక్‌లు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే బిహార్‌లో వచ్చే 24 గంటల్లో పాట్నా సహా 13 జిల్లాల్లో వరద హెచ్చరికలు జారీ చేశారు. ఆకస్మిక వరద హెచ్చరిక ఉన్న జిల్లాల మెజిస్ట్రేట్లకు విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు పంపింది. అదే సమయంలో ఐదు జిల్లాల్లో అధిక వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.
ఉత్తరాఖండ్‌లో ఎల్లో రెయిన్ అలర్ట్ ప్రకటించారు. రాజస్థాన్ గురించి మాట్లాడినట్లయితే తూర్పు, పశ్చిమ రాజస్థాన్ ప్రాంతంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రుతుపవనాలు విడిచిపెట్టకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రమైన బెంగాల్‌లోని డార్జిలింగ్ పరిస్థితి భారీ వర్షాల కారణంగా పరిస్థితి దిగజారింది. దీంతో కొండ ప్రాంతాలలో సామాన్య ప్రజల ఇబ్బందులు పెరగడమే కాకుండా దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల రాక ఆగిపోయింది
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.