కాకినాడ: బోటు ప్రమాదంపై హైలెవల్ టెక్నికల్ కమిటీ సమావేశం జరిగిందని చెప్పిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి.. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్కు బోటు వెలికితీసే పనులు అప్పగించామని తెలిపారు. బాలాజీ మెరైన్స్కు ఈ రంగంలో 35 సంవత్సరాల అనుభవం ఉందన్నారు. బోటును వెలికితీయడానికి ఇప్పటికే రూ.22.70 లక్షలు ఖర్చు చేశామని కలెక్టర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా బోటు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య, వివరాలను వెల్లడించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి.. 26 మందిని సురక్షితంగా రక్షించగా, నదిలోంచి 36 మృతదేహాలను వెలికితీసినట్టు తెలిపారు. మరో 16 మృతదేహాలు లభ్యం కావాల్సి ఉండగా... అందులో ఏపీకి చెందిన 8 మంది, తెలంగాణకు చెందిన 8 మంది ఉన్నారు.