Infinix Hot 50I Price: 5000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి మరో శక్తివంతమైన మొబైల్‌.. ధర కేవలం రూ.9,200కే!

Infinix Hot 50I Price: త్వరలోనే భారత మార్కెట్‌లోకి Infinix Hot 50i మొబైల్‌ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ మొబైల్‌ లాంచ్‌ అయ్యింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 7, 2024, 02:56 PM IST
Infinix Hot 50I Price: 5000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి మరో శక్తివంతమైన మొబైల్‌.. ధర కేవలం రూ.9,200కే!

 

Infinix Hot 50I Price: ప్రముఖ చైనీస్‌ కంపెనీ ఇన్ఫినిక్స్ మార్కెట్‌లోకి కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్‌ చేస్తూ ముందుకు సాగుతోంది. ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలకే అందుబాటులోకి రావడం వల్ల యువత వీటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గతంలో మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన ఇన్ఫినిక్స్ హాట్‌ సిరీస్‌ మోడల్స్‌కి అద్భుతమైన క్రేజ్‌ లభించింది. దీంతో అప్పటి నుంచి కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన హాట్‌ సిరీస్‌లలోనే కొత్త కొత్త మొబైల్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అలాగే కంపెనీ తర్వలోనే మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం. 
  
ఇన్ఫినిక్స్ ఫిలిప్పీన్స్‌లో ఈ కొత్త మోడల్‌ను Infinix Hot 50i పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ మొబైల్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ త్వరలోనే భారత మార్కెట్‌లోకి కూడా లాంచ్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ నాలుగు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ మోడల్‌ ప్రస్తుతం స్లీక్ బ్లాక్, సేజ్ గ్రీన్, టైటానియం గ్రేతో పాటు డ్రీమీ పర్పుల్ కలర్‌ ఆప్షన్స్‌లో లాంచ్‌ అయ్యింది. ఇక దీని ధర వివరాల్లోకి వెళితే, రూ. 9,200 నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఎంతో శక్తివంతమైన 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ప్రత్యేకమైన ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 

Infinix Hot 50i ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
ఈ Infinix Hot 50i స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన డిస్ల్పేతో అందుబాటులోకి వచ్చింది. ఇది 1600x720 పిక్సెల్ రిజల్యూషన్‌ సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 6.7-అంగుళాల HD+ డిస్‌ప్లే సెటప్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది 20:9 యాస్పెక్ట్ రేషియోతో అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. దీని డిస్ల్పే  120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌తో వస్తోంది. అంతేకాకుండా గరిష్టంగా ఈ మొబైల్‌ 256 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. అలాగే ప్రత్యేకమైన ఫీచర్‌లో భాగంగా ఈ మొబైల్‌లో 2 TB ఇంటర్నల్ స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు.

ఇక ఈ ఇన్ఫినిక్స్ Hot 50i స్మార్ట్‌ఫోన్‌ ప్రాసెసర్‌ వివరాల్లోకి వెళితే, ఇది MediaTek Helio G81 చిప్‌సెట్‌ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది డబుల్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అలాగే పక్కనే  LED ఫ్లాష్‌ లైట్‌ కూడా ఉంటుంది. ఇందులోని ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్‌లతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 5000mAh బ్యాటరీతో పాటు 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వచ్చింది. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌లో అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News