Samantha: ‘మీ కథలో మీరే హీరోస్’.. జిగ్రా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ అయిన సమంతా.. వీడియో వైరల్..

Alia bhatt film Jigra prerelease Event: అలీయా భట్ సినిమా జిగ్రా ప్రీరీలీజ్ ఈవెంట్ కు నటి సమంతా అతిథిగా హజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 8, 2024, 08:40 PM IST
  • జిగ్రా ప్రీరిలీజ్ లో హల్ చేసిన సమంతా..
  • రానా నాకు అన్నయ్య అంటూ వ్యాఖ్యలు..
Samantha: ‘మీ కథలో మీరే హీరోస్’.. జిగ్రా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ అయిన సమంతా.. వీడియో వైరల్..

Samantha attended the pre release event of alia bhatt film jigra:  ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసిన సమంతా పేరు హల్ చల్ చేస్తుంది. ఇక తెలంగాణాలో అయితే స్పెషల్ గా చెప్పనవసరంలేదు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల ప్రభావంతో ఆమె మరోసారి ట్రెండింగ్ గా మారారు. ఈ క్రమంలో తాజాగా, ఆమె ఆలియా భట్ నటించిన జిగ్రా ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి.  తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘జిగ్రా’ అనే ప్రీ రిలీజ్ వేడుకకు గెస్ట్‌గా హాజరయ్యారు.

 

ఇదే వేడుకకు.. త్రివిక్రమ్ శ్రీనివాస్, దగ్గుబాటిరాణా సైతం వచ్చారు. ఈ క్రమంలో రాణాను సమంతా పొగుడుతూ కామెంట్లు చేశారు. రాణాలాంటి అన్నయ్య ప్రస్తుతం ప్రతి అమ్మాయికి కావాలని అన్నారు. రానా నాకు అన్నయ్య అని.. గత నెలలో.. ఒక ఫిమెల్ లీడ్ సినిమా చేశారు. ఇప్పుడు మరోసారి.. ఫిమెల్ లీడ్ మూవీ ప్రజెంట్ చేస్తున్నారు.  అందుకు ఆయన లాంటి అన్నయ్య అందరికి దొరకాలని అన్నారు. అంతేకాకుండా.. ఇదే వేడుకలో హజరైన త్రివిక్రమ్ సైతం.. సమంతాపై ప్రశంసలు కురిపించారు.

అదే విధంగా సమంతా.. కొన్నేళ్లుగా బాలీవుడ్ సినిమాలే చేస్తున్నారన్నారు. ముంబైలోని ఎక్కువగా ఉంటున్నారని, ఆమె అభిమానులు నిరాశ పడుతున్నారన్నారు. ఆమె హెల్త్ అప్ డేట్ పైన కూడా అభిమానులు కాస్తంతా ఆందోళన చెందుతున్నారన్నారు. అంతేకాకుండా.. జీగ్రా నటి ఆలియా భట్.. కూడా.. సమంతా గొప్ప ధైర్యశాలి అని, ఆఫ్ స్క్రీన్ లో కూడా.. ఆమె హీరో అన్నారు. ఆమెను చూసి ఎన్నో నేర్చుకొవచ్చన పొగడ్తల వర్షం కురిపించారు.

Read more: Nagarjuna: నాంపల్లి కోర్టులో హజరైన నాగార్జున.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఏం చెప్పారంటే..?

సామ్.. తన టాలెంట్ తో నిలదొక్కుకున్నారన్నారు. పురుషుల డామినేషన్ ఉన్న కూడా.. ఆమె నిలదొక్కుకుని నిలిచారన్నారు. ప్రతి ఒక్కరికి సామ్ ఒక ఆదర్శమన్నారు.  ఈ క్రమంలో సమంతా కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘హీరోయిన్స్‌గా మాకు ఓ బాధ్యత ఉంటుంది. మా‌ సినిమాలు చూసే అమ్మాయిలకు ఎవరి కథలో వారే హీరో అనే విషయాన్ని గుర్తుచేయటమన్నారు. ఆలియా భట్ ఆ విషయాన్ని తన సినిమా ద్వారా గుర్తు చేసింది. మీ సినిమాకు మీరే హీరోస్ అని సమంతా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News