Taps Stolen: సర్కార్‌ నల్లాలు కూడా వదిలిపెట్టలేదు.. 9 లక్షల విలువైన ఇత్తడి నల్లాలు చోరీ

Jal Jeevan Mission Bronze Taps Stolen: దొంగలు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వస్తువులను కూడా వదలడం లేదు. కేంద్ర ప్రభుత్వ నల్లాలను దొంగలను చోరీకి పాల్పడ్డారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 11, 2024, 05:25 PM IST
Taps Stolen: సర్కార్‌ నల్లాలు కూడా వదిలిపెట్టలేదు.. 9 లక్షల విలువైన ఇత్తడి నల్లాలు చోరీ

Bronze Taps Stolen: కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత నివాసితులకు అందించాల్సిన నల్లాలను దొంగలు చోరీ చేశారు. ఇంటింటా నల్లాలు వేసి తాగునీరు అందిచాల్సిన లక్ష్యానికి దొంగలు తూట్లు పొడిచారు. కంపెనీని ఏమార్చి దొంగతనానికి పాల్పడేందుకు ప్రయత్నించగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో ఈ దొంగలు చిక్కారు. పట్టుబడిన నల్లాల విలువ రూ.9 లక్షల ఉంటుందని.. మొత్తం 9 వేల నల్లాలు దొంగించారు. ఈ విషయాన్ని శ్రీకాకుళం పోలీసులు వెల్లడించారు.

Also Read: Priests: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆలయాల్లో అధికారులకు చెక్‌ పూజారులదే అధికారం

ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో ఈ పథకం అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆ పథకంలో భాగంగా నల్లాకు ఇత్తడి నల్లా బిగిస్తారు. అయితే ఆ ఇత్తడి నల్లాలను కొందరు ముఠాగా ఏర్పడి వాటిని దొంగలించారు. దొంగతనం చేసి వేరే ప్రాంతానికి తరలిస్తుండగా శ్రీకాకుళం పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Also Read: Loco Pilot: దసరా ఉత్సవాల వేళ విజయవాడలో కలకలం.. లోకో పైలెట్‌ దారుణ హత్య

 

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి  మండలం జర్జంగి జాతీయ రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతున్నారు. ఈ క్రమంలో ఓ భారీ వాహనం వస్తుండగా దాన్ని ఆపి పరిశీలించారు. అయితే వారి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో మొత్తం వాహనం పరిశీలించారు. ఈ క్రమంలో మొత్తం ఇత్తడి నల్లాలు కనిపించాయి. వాటి వివరాలు ఆరా తీయగా జల్‌ జీవన్‌ మిషన్‌ నల్లాలు అని చెప్పారు. 9 లక్షల విలువైన మొత్తం 9 వేల ఇత్తడి నల్లాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి మీడియాకు తెలిపారు. కోట బొమ్మాళి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు మొత్తం ఏడుగురిని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. 9 వేల ఇత్తడి నీటి నల్లాల విలువ రూ.9 లక్షలు ఉంటుందని తెలిపారు. కంది సంపత్, బొందాని రమేష్, చింతల మహేశ్‌,  పల్లపు యాదగిరితోపాటు తెలంగాణ రాష్ట్ర లోని హన్మకొండ జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు ఎన్‌ఏఆర్ ఇన్ఫ్రా కంపెనీలో కూలీలుగా పని చేస్తూ నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, పోలాకి మండలాల్లో సంచరించేవారు. కంపెనీ ట్యాప్‌లను అమ్మి అక్రమంగా డబ్బు సంపాదించాలని పథకం వేయగా పోలీసుల ప్రవేశంతో వారి దొంగతనం కుట్ర బట్టబయలైంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News