ఆర్టీసీ సమ్మెపై విచారణ: వాస్తవాలను తెలివిగా దాచిపెడుతున్నారని హై కోర్టు అసంతృప్తి

వాస్తవాలను తెలివిగా దాచిపెడుతున్నారు: హై కోర్టు ఆగ్రహం

Last Updated : Oct 30, 2019, 10:09 AM IST
ఆర్టీసీ సమ్మెపై విచారణ: వాస్తవాలను తెలివిగా దాచిపెడుతున్నారని హై కోర్టు అసంతృప్తి

హైదరాబాద్: ఆర్టీసీకి సర్కార్ నుంచి రావాల్సి ఉన్న బకాయిలపై సర్కార్ తరపున తెలంగాణ ఆర్థిక శాఖ సమర్పించిన నివేదికపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారులు ఒక పద్ధతి ప్రకారం వాస్తవాలను దాచిపెడుతున్నారని అభిప్రాయపడిన కోర్టు.. రూ. 4,253 కోట్ల నిధులు ఇస్తే ఇక బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ సమ్మెపై మంగళవారం విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీకి పెండింగ్ పడిన బకాయిలపై ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. ఆర్టీసీకి ఎలాంటి బకాయిలు లేవని నివేదికలో పేర్కొన్న అడ్వకేట్ జనరల్... రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీలో ఆస్తుల పంపకం జరగలేదన్నారు. ఆర్టీసీకి ఇవ్వాల్సి వున్న బకాయిల్లో 48% తెలంగాణ, 52% ఏపీ చెల్లించాల్సి ఉందని ఏజీ కోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. 

ఏజీ సమర్పించిన నివేదికను పరిశీలించిన న్యాయస్థానం.. ఇప్పటివరకు ఆర్టీసీ ఆస్తుల పంపకం ఎందుకు పూర్తికాలేదని ఏజీని ప్రశ్నించింది. దీంతో ఆర్టీసీ విభజన బాధ్యత కేంద్రానిదేనని తెలిపారు. తెలంగాణ నుంచి ఆర్టీసీకి రూ.1,099 కోట్లు బకాయిపడ్డామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.

Trending News