మరోసారి తెరపైకి 'దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్' డిమాండ్

మరోసారి తెరపైకి 'దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్' డిమాండ్

Last Updated : Nov 11, 2019, 03:45 PM IST
మరోసారి తెరపైకి 'దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్' డిమాండ్

హైదరాబాద్‌: హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలనే డిమాండ్ మరోసారి తెరపైకొచ్చింది. ఈమేరకు హైదరాబాద్‌లోని వివిధ జేఏసీల ప్రతినిధులు మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావును కలిసి విజ్ఞప్తిచేశారు. ఆదివారం విద్యాసాగర్‌ రావును ఆయన నివాసంలోనే కలిసిన సౌత్‌ ఇండియా పొలిటికల్‌ జేఏసీ, అడ్వకేట్‌ జేఏసీ, జర్నలిస్ట్‌ జేఏసీ ప్రతినిధులు.. ఢిల్లీలో అంతకంతకూ పెరుగుతున్న కాలుష్యం, దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు ఢిల్లీ దూరంగా ఉండటం వంటి అంశాల కారణంగా వివిధ అవసరాలరీత్యా దేశ రాజధానికి వెళ్లాలనుకునే ప్రజలు తీవ్ర అసౌకార్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్‌ని దేశ రాజధానిగా చేస్తే కలిగే లాభాలను ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. 

ఇటీవల హైదరాబాద్‌లో ఓ బుక్ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యాసాగర్ రావు సైతం.. హైదరాబాద్‌ని దేశానికి రెండో రాజధానిగా చేయాలనే అభిప్రాయాన్ని వినిపించిన నేపథ్యంలోనే సౌత్‌ ఇండియా పొలిటికల్‌ జేఏసీ, అడ్వకేట్‌ జేఏసీ, జర్నలిస్ట్‌ జేఏసీ ప్రతినిధులు ఆయనకు ఈ విజ్ఞప్తి చేశారు.

Trending News