Viral Video: నడిరోడ్డుపై నాగుపాము-ముంగిస ఫైటింగ్..చివరిలో ట్విస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

Fight Between Snake And Mongoose : నాగు పాము-ముంగిస రెండూ తారాసపడితే ఎలా ఉంటుంది. భీకరపోరు షురూ అవుతుంది. అది నడిరోడ్డుపై అయితే మరింత మజా ఉంటుంది. నడిరోడ్డుపై నాగుపాము, ముంగిస మధ్య జరిగిన ఫైటింగ్ చూసి వాహనాలు ఆపేసి మరీ ఎంజాయ్ చేయాశారు వాహనదారులు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.   

Written by - Bhoomi | Last Updated : Oct 18, 2024, 08:28 AM IST
Viral Video: నడిరోడ్డుపై నాగుపాము-ముంగిస ఫైటింగ్..చివరిలో ట్విస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

Fight Between Snake And Mongoose : నాగుపాము, ముంగిస ఎదురుపడితే భీకరపోరు జరగాల్సిందే. చివరి ఏదొకటి పారిపోవడంమో..ప్రాణాలు కోల్పోవడమో జరుగుతుంది. కానీ ఈ రెండింటి మధ్య జరిగే ఫైటింగ్ చూస్తుంటే మాత్రం మస్తు మజా ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు జంతువుల మధ్య ఎలాంటి వైరం లేకపోయినా పాము ముంగిస ఆహారం కావడం ఈ పోరాటం షురూ అవుతుంది. సాధారంగా పాములు చాలా వేగంగా స్పందిస్తాయని అనుకుంటాం కానీ ముంగిసలు పాములకంటే వేగంగా స్పందిస్తాయట. అందుకే చాలా పోరాటాల్లో ముంగిసలదే పై చేయి. కొన్ని సందర్భాల్లో పాములు తప్పించుకుని పారిపోతుంటాయి. 

ఇంతకీ ఈ స్టోరీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే..అచ్చం ఇలాంటి ఘటననే  తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో జరిగింది. గురువారం మధ్యాహ్నం మహ్మదాబాద్-రోటిగూడు గ్రామాల మధ్య రోడ్డుపై ఎదురుపడ్డ నాగుపాము, ముంగిస రెండు తలపడ్డాయి. నడిరోడ్డుపై నాగుపామును చూసిన వాహనదారులు తమ వాహనాలను నిలిపివేసి భయంతో పక్కకు పరిగెత్తారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ ముంగిసను పాము చూసింది. నాగుపాము పడగ విప్పి మరీ ముంగిసతో పోరుకు రెడీ అయ్యింది. ఈ రెండు జంతువుల మధ్య కొన్ని నిమిషాలపాటు పెద్ద యుద్ధమే జరిగింది. 

Also Read: Tamanna Bhatia: HPZ యాప్‌ స్కామ్ ఈడీ విచారణకు తమన్నా.. ఈ మనీలాండరీంగ్‌ కేసుతో మిల్కీబ్యూటీకి ఉన్న లింక్‌ ఏంటంటే..?

ఈ పోరాటంలో ముంగిసదే పైచేయి. ఓ దశలో పాము తప్పించుకునే ప్రయత్నం చేసింది. ముంగిస ఊరుకుంటుందా..అస్సలు వదల్లేదు. చివరకు ముంగిస బలం ముందు పాము మోకారిల్లాల్సి వచ్చింది. ముంగిస పామును చంపి నోట్లో కరుచుకుని పొదల్లోకి పారిపోయింది. ఈ ఘటనను వాహనదారులు తమ మొబైల్ ఫోన్లో వీడియో తీయడంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. 

 

Also Read: YS Jagan Mohan Reddy: 30 శాతం ఇస్తావా.. 40 శాతం ఇస్తావా.. లిక్కర్ పాలసీపై మాజీ సీఎం జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..   

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

 

Trending News