Home Remedies For Acidity: ప్రస్తుతకాలంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో అసిడిటీ ఒకటి. అసిడిటీ వల్ల కడుపులో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ఇది జీర్ణవ్యవస్థలో ఆమ్లం ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమస్య కలుగుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడం కోసం చాలా మంది మార్కెట్లో లభించే మందుల, ఈనో వంటివి ఉపయోగిస్తుంటారు. కానీ ఎలాంటి ప్రయోజనం కనిపించదు. అసిడిటీని సహాజంగా తగ్గించుకోవడం ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలను ఉపయోగిస్తే సరిపోతుంది.
కొన్ని సహజ నివారణలు:
అసిడిటీ వల్ల కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడం కోసం జీలకర్ర ఎంతో సహాయపడుతుంది. దీని కోసం మీరు ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ జీలకర్ర కలిపి ఉడికించుకోవాలి. ఆ తరువాత వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా చేయడం వల్ల కడుపు నొప్పి, ఉబ్బరం తగ్గుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన కడుపు నొప్పి ఉన్నప్పుడు అల్లం ముక్క నమలడం మంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అసిడిటీ వల్ల కలిగే సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. అల్లం నేరుగా తినడానికి ఇష్టపడనివారు అల్లం టీని తాగవచ్చు. అలాగే అసిడిటీని తగ్గించడంలో పెప్పర్మింట్ టీ ఎంతో మేలు చేస్తుంది. ఇది కడుపులోని ఆమ్ల ఉత్పత్తిని తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
అసిడిటీని తొలగించడంలో బేకింగ్ సోడా సహాయపడుతుంది. ఒక గ్లాస్ చల్ల నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి తాగడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది. కానీ దీన్ని అధికంగా తీసుకోకూడదు. ఇది ఉపయోగించే ముందు నిపుణులు సలహా తీసుకోవడం చాలా మంచిది. అసిడిటీ ఉన్నవారు రాత్రి పడుకొనే ముందు ఒక గ్లాస్ పాలు తాగడం మంచిది కాదు. దీని వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి బదులుగా ఒక గ్లాస్ మజ్జిగా తీసుకోవడం చాలా మంచిది. దీని వల్ల కడుపులో మంట కలగకుండా ఉంటుంది. మజ్జిగ తాగడానికి ఇష్టపడని వారు కొబ్బరి నీరు తాగడం చాలా ఉత్తమం. ఇది ఎసిడిటీని తగ్గిస్తుంది.
ముఖ్యమైన విషయాలు:
పులియబడిన ఆహారాలు, కొవ్వు ఆహారాలు, మసాలా ఆహారాలు, కాఫీ, టీ, సోడా వంటి వాటిని తక్కువగా తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడం, నిద్ర సరిపోయేలా చూసుకోవడం, తరచుగా చిన్న చిన్న భోజనాలు చేయడం వంటివి ఎసిడిటీని నివారించడానికి సహాయపడతాయి.
గమనిక: ఈ సమాచారం కేవలం సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు వైద్యుడిని సంప్రదించడమే ఉత్తమం.
Also Read: Weight Loss Upma Recipe: శరీర బరువును తగ్గించే బ్రౌన్ ఉప్మా.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook