boy friend ablaze girl in Kadapa badvel: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల కాలంలో అమ్మాయిలపై అనేక దాడులకు సంబంధించిన ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నట్లు తెలుస్తొంది. మరోవైపు కూటమి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న మహిళలపై మాత్రం అఘాయిత్యాలు ఆగడంలేదు. తాజాగా, వైఎస్సార్ జిల్లా బద్వేలులో జరిగిన ఘటన ఏపీని ఉలిక్కిపడేలా చేసిందని చెప్పుకొవచ్చు. ఇంటర్ చదువుతున్న విద్యార్థినిని నిర్మానుష్య ప్రదేశానికి రావాలని ఆమె ఫ్రెండ్ పిలిచాడు. వీరిద్దరికి కూడా ఐదేళ్లుగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బద్వేలులో విఘ్నేష్ అనే యువకుడు.. అమ్మాయిని అడవిలోకి రమ్మని పిలిచాడు. గతంలో వీరిద్దరు కూడా ప్రేమించుకున్నట్లు తెలుస్తొంది .
యువతి రానంటే.. చచ్చిపోతానంటూ కూడా అతగాడు బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే.. అతని మాయమాటలు నమ్మి యువతి అడవికి వెళ్లింది. అక్కడ ఆమెతో గొడవ పడి పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. అపోసిషన్ పార్టీలు కూటమిని ఏకీపారేశాయి. కూటమి అధికారంలోకి వచ్చాక.. మహిళలు, అమ్మాయిల భధ్రత పూర్తిగా గాల్లోదీపంలా మారిందని కూడా తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశాయి.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. ఘటనకు కారణమైన నిందితుడ్నికఠినంగా పనిష్మెంట్ పడేలా చూడాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును సైతం ఏర్పాటు చేసి చర్యలు తీసుకొవాలన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి, విచారణ ప్రారంభిచారు. అయితే.. పోలీసులు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది.
Read more: YS Jagan: 'దిశా' లేని చంద్రబాబు ఇదేమి రాజ్యం? అత్యాచారాలపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం
యువతీ, యువకులు ఇద్దరు నిర్మానుష్య అటవీ ప్రాంతంలో మొదట మాట్లాడుకున్నారని, ఆ తర్వాత శృంగారంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇద్దరు కూడా కొన్ని విషయాలలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, అప్పటికే తనతోపాటు పెట్రోల్ తెచ్చుకున్న సదరు యువకుడు.. యువతిపై చల్లి నిప్పంటించినట్లు కూడా పోలీసుల విచారణలో బైటపడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనపై యువతి తల్లీ మాత్రం నిందితుడ్ని.. తన బిడ్డను కాల్చినట్లు.. అతడ్ని కూడా నడిరోడ్డు మీద పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చేయాలని కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ డిమాండ్ చేసింది. యువతి ఆస్పత్రిలో బెడ్ మీద చివరలో మాట్లాడిన వీడియోలు కూడా వైరల్ గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.